‘గంగా’ నాసిక్ లో పుట్టింది.. కాదు కాదు.. ‘కృష్ణా’ అక్కడ పుట్టింది - మీడియా సమావేశంలో ఏపీ ఏఏజీ, సీఐడీ చీఫ్
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వివరించేందుకు ఏపీ సీఐడీ చీఫ్, ఏపీ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నదుల జన్మస్థలాలను వారు తప్పుగా ప్రస్తావించారు.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆ కేసు వ్యవహారం మొన్నటి వరకు ఏపీకే పరిమితమైనా.. నిన్న తెలంగాణకు చేరింది. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించిన వివరాలను వారిద్దరూ అందులో వివరించే ప్రయత్నం చేశారు.
కొంత మంది దోషులు ఇతరుల కంటే ప్రత్యేకం - బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు
ఈ కేసును వివరిస్తున్న క్రమంలో వారు నదుల జన్మస్థలాలను తప్పుగా ప్రస్తావించారు. ఈ కేసు మొదట మహారాష్ట్రలోని పూణెలో మొదలైందనే విషయాన్ని చెప్పాలని భావించి.. కొంత నాటకీయత జోడించేందుకు ప్రయత్నించారు. గంగా నది పుట్టిన చోటే ఈ కేసు కూడా పుట్టిందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు అన్నారు. గంగా నది నాసిక్ లో జన్మించినట్టు.. ఈ కేసుకు పుణె నాసిక్ పాయింట్ లాంటిది అని తెలిపారు. గంగా నది నాసిక్ నుంచి ప్రవహిస్తూ.. దిగువ ప్రాంతానికి చేరిన మాదిరిగానే.. ఈ కేసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని చెప్పారు.
రామచరితమానస్ లో పొటాషియం సైనైడ్ ఉంది - బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ
అయితే ఈ సమయంలో గంగా నది నాసిక్ లో జన్మించింది అని పలకగానే.. పక్కనే ఉన్న సీఐడీ చీఫ్ సంజయ్ కల్పించుకొని.. అక్కడ పుట్టింది గంగా నది కాదని, ‘కృష్ణా’ అని ఆయనకు మెళ్లగా సూచించారు. వెంటనే చేతితో మైక్ ను మూసేసిన ఏఏజీ..చిన్నగా కృష్ణా.. కృష్ణా.. అని అన్నారు. తరువాత అది కూడా వినిపించుకోకుండా గంగా నది నాసిక్‌లో జన్మించిందని అంటూ పలుమార్లు ప్రస్తావవించారు.
మరే ఇతర భారతీయ భాషతోనూ హిందీ పోటీ పడలేదు - కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కాగా.. వాస్తవానికి నాసిక్ లో గంగా నది జన్మించలేదు అలాగని కృష్ణా నది కూడా అక్కడ జన్మించలేదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నది మాత్రం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకంలో జన్మించింది. గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో ఉన్న గంగోత్రిలో ఉద్భవించింది. అలాగే కృష్ణా నది మహారాష్ట్రలోని పడమటి కనులలో మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో జన్మించింది. అక్కడ సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది.