గజ్వేల్: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  పోటీ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ మరోసారి ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన  ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ దఫా ప్రజా కూటమి( మహా కూటమి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.  గత ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన  తూంకుంట నర్సారెడ్డి వారం రోజుల క్రితమే  తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  దీంతో గజ్వేల్ రాజకీయాల్లో హట్ హట్ గా మారాయి.

2009 వరకు ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌డ్‌గా ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈ అసెంబ్లీ స్థానం జనరల్‌గా మారింది. 2009 ఎన్నికల్లో  ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో నర్సారెడ్డి విజయం సాధించారు.  2014లో  తెలంగాణలో  జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నుండి మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేశారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే  సంఖ్యలో టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు రావడంతో  తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేశారు.ఆ తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో మెదక్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

ఈ నాలుగేళ్లలో  తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో గజ్వేల్ నుండి  టీడీపీ అభ్యర్థిగా  ఒంటేరు ప్రతాప్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డిలు , టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేశారు.  టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ విజయం సాధించారు.

అయితే  గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి సరిగా ప్రచారం నిర్వహించలేదని  విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి తన ఓట్లను తాను వేయించుకోగలిగితే టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి ఫలితం అనుకూలంగా ఉండేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే  ఇటీవల కాలంలో  ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి మహా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నర్సారెడ్డి...  ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు.

తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా పనిచేశారు. అయితే రెండు వారాల క్రితం నర్సారెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రతాప్ రెడ్డికి కలిసొచ్చే పరిణామంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని మంత్రి హరీష్ రావు తన భుజాలపై వేసుకొన్నారు.  గత ఎన్నికల సమయంలో కూడ గజ్వేల్‌లో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హరీష్ రావు చూసుకొన్నారు. సిద్దిపేట నుండి హరీష్ రావు పోటీ చేస్తున్నప్పటికీ...  ఆ స్థానంలో తన గెలుపు నల్లేరుపై నడకగానే భావిస్తున్నారు. దరిమిలా  గజ్వేల్‌పై ఎక్కువగా  కేంద్రీకరిస్తున్నారు.

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  టీఆర్ఎస్‌ అసంతృప్తులను  తమ వైపుకు తిప్పుకొనేందుకు గాను ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను తమ వైపుకు తిప్పుకొనేందుకు హరీష్  ప్రయత్నిస్తున్నారు.

జెండా పండుగ పేరుతో వంటేరు ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. అన్ని గ్రామాల్లో మొదటి దశ పూర్తిచేశారు. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి తమ పార్టీ వైపు ఆకర్షిస్తున్నారు. మండలాల వారీ సమావేశాలతో తన పాత టీడీపీ)క్యాడర్‌, కొత్త క్యాడర్‌ మధ్య సమన్వయం చేసుకొంటున్నారు. 

మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ప్రతాప్ రెడ్డి ప్రచారం చేశారు. 

సీఎం కేసీఆర్ కోసం టీఆర్ఎస్‌ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వంద మందికి ఒక టీఆర్ఎస్‌ కార్యకర్తను నియమించి రోజు వారీగా ప్రచార బాధ్యతను అప్పగించారు. ఇప్పటికే  నియోజకవర్గంలో 128 గ్రామాల్లో టీఆర్ఎస్‌ ప్రచారాన్ని పూర్తి  చేసింది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్త నాయకుల్ని బుజ్జగిస్తూ కాంగ్రె్‌సలోని అసమ్మతులపై కన్నేశారు. వారితో హరీష్ రావు మంతనాలు  చేస్తున్నారు. 

2009లో ప్రత్యర్థులుగా తలపడ్డ నర్సారెడ్డి, వంటేరు ఒకే గూటికి చేరడంతో తమ బలం పెరిగిందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే వంటేరు, నర్సారెడ్డి వర్గాల మధ్య  దశాబ్దాలుగా వైరం ఉంది.అయితే క్షేత్రస్థాయిలోక్యాడర్ కలిసే అవకాశం ఉండదని  టీఆర్ఎస్ భావిస్తోంది.  మరో వైపు  గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 6 వేల కోట్లతో  అభివృద్ధి పనులను నిర్వహించినట్టుగా టీఆర్ఎస్ నేతలు  ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

దేవరకొండలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎం.బీ. చౌహాన్

కొల్లాపూర్‌లో వరుసగా ఐదుసార్లు జూపల్లి గెలుపు

నకిరేకల్‌లో నర్రాదే హవా: ఐదుసార్లు వరుసగా విజయం

సిద్దిపేట సరళి: మామను మించిన అల్లుడు

కేసీఆర్ ఇలాకాలో గతంలో కాంగ్రెస్‌దే హవా