Asianet News TeluguAsianet News Telugu

దేవరకొండలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎం.బీ. చౌహాన్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి బద్దూ చౌహాన్  హ్యాట్రిక్ సాధించారు

Devarakonda assembly segment results since 1952
Author
Devarakonda, First Published Nov 1, 2018, 6:13 PM IST

దేవరకొండ:  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి బద్దూ చౌహాన్  హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత వరుసగా  ఎవరూ కూడ ఈ స్థానంలో వరుసగా విజయం సాధించలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బద్దూ చౌహాన్  పార్టీ నిర్ణయం మేరకు దేవరకొండలో వరుసగా పోటీ చేసి విజయం సాధించారు.

ఉమ్మడి  నల్గొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలో   కాంగ్రెస్ పార్టీ 8 దఫాలు విజయం సాధించింది. 8 దఫాలు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఒక దఫా కాంగ్రెస్(ఐ) అభ్యర్థి విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి ఈ స్థానం నుండి విజయం సాధించారు.

1957లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎం. లక్ష్మయ్య (26570) తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి వి. చంద్రయ్యపై (16595) విజయం సాధించారు. జనరల్ స్థానంలో  కాంగ్రెస్ అభ్యర్థి జి. నారాయణరెడ్డి (25,200) తన సమీప పీడీఎప్ అభ్యర్థి పీవీరెడ్డి(24721)పై విజయం సాధించారు.

1962లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు.ఈ ఎన్నికల్లో సీపీఐ కు చెందిన పెద్దయ్య(17425) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎం. లక్ష్మయ్య(12491)పై విజయం సాధించారు.1967లో ఈ నియోజకవర్గాన్ని జనరల్ కేటగీరీగా మార్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి. నారాయణరెడ్డి(31422), సీపీఐ అభ్యర్థి పల్లా పర్వతరెడ్డి(10441)పై విజయం సాధించారు.

1972లో సీపీఐ అభ్యర్థి బి. రామశర్మ(21,408) కాంగ్రెస్ అభ్యర్థి డి.చౌహాన్(11239) పై గెలిచారు.1978 నుండి ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు.  1978లో డి.రవీంద్రనాయక్(35340) తన సమీప సీపీఐ అభ్యర్థి హరియా(19,666) నెగ్గారు. 1983లో కూడ రవీంద్రనాయక్(23852) సీపీఐ అభ్యర్థి హరియా 20692)పై గెలిచారు.1985లో సీపీఐ అభ్యర్థిగా బద్దూ చౌహాన్ తొలిసారిగా ఈ స్థానం పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు.

1985లో సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగిన బద్దూ చౌహాన్(46525) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి(21404)పై గెలిచారు. 1989లో  మరోసారి సీపీఐ అభ్యర్థిగా బద్దూ చౌహాన్ (49414) కాంగ్రెస్ అభ్యర్థి రాగ్యానాయక్‌పై(44214)పై నెగ్గారు.1994లో సీపీఐ అభ్యర్థి బద్దూ చౌహాన్(56630) ఇండిపెండెంట్ అభ్యర్థి రాగ్యానాయక్‌పై(33557) గెలిచారు.1985 నుండి 1994 వరకు సీపీఐ , టీడీపీ మధ్య పొత్తు కారణంగా ఈ స్థానంలో సీపీఐ పోటీ చేసేది.1999 ఎన్నికల సమయంలో సీపీఐ, టీడీపీ మధ్య పొత్తు లేదు. ఆ సమయంలో సీపీఐ ఒంటరిగా పోటీచేసింది.

1999 ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ అభ్యర్థి రాగ్యానాయక్(46294) తన సమీప టీడీపీ అభ్యర్థి వశ్యానాయక్‌పై(45907)పై నెగ్గారు.2002 లో మహాబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మద్దిమడుగు వద్ద దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో  ఉప ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ అభ్యర్థులను నిలపలేదు. దీంతో  రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్  దేవరకొండ నుండి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్,  టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్. రవీంద్రకుమార్(61748) తన సమీప టీడీపీ అభ్యర్థి  వి.శక్రునాయక్‌పై (44561) విజయం సాధించారు.2009 ఎన్నికల్లో  టీడీపీ, సీపీఐ, సీపీఎం మహాకూటమిగా పోటీ చేశాయి.

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్(64887) తన సమీప సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్ పై(57419)పై గెలిచారు.2014 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా రవీంద్రకుమార్(57717) తన ప్రత్యర్థి టీడీపీ బిల్యానాయక్‌(53501)పై విజయం సాధించారు. ఏడాది క్రితం రవీంద్రకుమార్ సీపీఐ నుండి టీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా రవీంద్రకుమార్  టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

సంబంధిత వార్తలు

కొల్లాపూర్‌లో వరుసగా ఐదుసార్లు జూపల్లి గెలుపు

నకిరేకల్‌లో నర్రాదే హవా: ఐదుసార్లు వరుసగా విజయం

సిద్దిపేట సరళి: మామను మించిన అల్లుడు

కేసీఆర్ ఇలాకాలో గతంలో కాంగ్రెస్‌దే హవా

Follow Us:
Download App:
  • android
  • ios