నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు
రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)
నల్గొండ:నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు
నల్గొండ:నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. తొలుత బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. సుమారు రెండున్నర గంటటపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
బుధవారం నాడు ఉదయం ఆరు గంటలకు హైద్రాబాద్ నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు గుర్తించారు. చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన శరీరం సహకరించలేదని సమాచారం.
ఉదయం నాలుగుగంటల సమయంలో హరికృష్ణ హైద్రాబాద్ నుండి బయలు దేరినట్టు చెబుతున్నారు. హైద్రాబాద్ నుండి హరికృష్ణ తానే డ్రైవ్ చేసుకొంటూ వస్తున్నాడు. హరికృష్ణ వాహనం అన్నెపర్తి వద్దకు చేరుకొని మీతిమీరి వేగంతో డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తోన్న వాహనంపై ఢీకొట్టింది.
కారు నుండి హరికృష్ణ వాహనం నుండి రోడ్డుపైన పడిపోయాడు. తీవ్ర గాయాలతో హరికృష్ణ రోడ్డుపైన పడిపోయాడు. ఈ ప్రమాదంతో భారీ శబ్దం రావడంతో అన్నెపర్తి బెటాలియన్ పోలీసులు వెంటనే హరికృష్ణను ఆసుపత్రికి తరలించారు.
నందమూరి హరికృష్ణ కుటుంబసభ్యులకు గతంలో కూడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు. హరికృష్ణ తనయుడు జానకీరామ్ చనిపోయాడు. తాజాగా హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
హరికృష్ణ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోత్కుపల్లి
హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...
రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?
కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
ఆస్పత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: ఇంటికి చేరుకుంటున్న బంధువులు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 9, 2018, 1:50 PM IST