రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 29, Aug 2018, 9:42 AM IST
Senior tdp leaders died in road accidents
Highlights

రోడ్డు ప్రమాదాలు టీడీపికి నష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు కీలకమైన టీడీపీ నేతలు దుర్మరణమయ్యారు


హైదరాబాద్:  రోడ్డు ప్రమాదాలు టీడీపికి నష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు కీలకమైన టీడీపీ నేతలు దుర్మరణమయ్యారు.  కీలకమైన టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కీలకమైన నేతలు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నార్కట్ పల్లి మండలంలో జరగడం  గమనార్హం.

తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు లాల్‌జాన్ భాషా, ఎర్రన్నాయుడు, హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014 ఎన్నికలకు ముందు విశాఖపట్టణం నుండి శ్రీకాకుళం జిల్లాకు కారులో టీడీపీ నేతలతో కలిసి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మృతి  చెందాడు.

రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఎర్రన్నాయుడు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆసుపత్రిలోనే ఆయన మృత్యువాతపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీలో ఆయా ప్రాంతాలకు అనుకూలంగా ఉద్యమాలు సాగుతున్నాయి. 

ఆ సమయంలో టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ భాషా విజయవాడలో టీడీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైద్రాబాద్ నుండి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు.

లాల్‌జాన్ భాషా కారు కూడ నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రి సమీపంలోనే రోడ్డు ప్రమాదానికి గురైంది. బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నార్కట్ ‌పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతిచెందాడు.
 

loader