హైదరాబాద్: సినీ నటుడు, తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని కారు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. హరికృష్ణ హైదరాబాదు నుంచి నెల్లూరు వెళ్తూ ప్రమాదానికి గురై మరణించారు. 

నందమూరి హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. ఆయన నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు మూడు పల్టీలో కొట్టినట్లు సమాచారం. 

కారులో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరు సీటు బెల్టు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. కానీ కారులో హరికృష్ణ ఒక్కరే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దరు కారులో ఉన్నారా, లేదా అనేది నిర్దారణ కాలేదు. కారు అత్యంత వేగంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. గంటకు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో హరికృష్ణ కారు నడిపినట్లు భావిస్తున్నారు.

హరికృష్ణ కారు హైదరాబాదుకు చెందిన కృష్ణ అనే ఫొటోగ్రాఫర్ కారును ఢీకొట్టింది. అయితే, ఆ కారులో ఎవరున్నారు, ఎంత మంది ఉన్నారు అనే విషయాలు తనకు తెలియవని కృష్ణ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు.

నందమూరి హరికృష్ణ మృతితో తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

నాన్నకు ప్రేమతో.. లక్ష కిలోమీటర్లు చైతన్యరథాన్ని నడిపిన హరికృష్ణ

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్