ఫిల్మ్ నగర్‌లో భర్త జగన్‌ను హత్య చేయడంలో  దేవికకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో భర్త జగన్‌ను హత్య చేయడంలో దేవికకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను జగన్ ఇంట్లో నుండి అరుపులు విన్పించి అక్కడికి చేరుకొనే సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోతున్న విషయాన్ని గుర్తించినట్టు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు సమాచారం.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవికలు భార్య,భర్తలు. ఇటీవల కాలంలోనే వారు హైద్రాబాద్ ఫిల్మ్‌నగర్‌‌కు నివాసాన్ని మార్చారు. అయితే పిల్లలతో కలిసి చనిపోదామని తనను బలవంతం చేయడంతోనే తాను అతడిని హత్య చేసినట్టు దేవిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే దేవిక ముందస్తుగానే జగన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందా.. లేక యాధృచ్ఛికంగానే ఈ ఘటన చోటు చేసుకొందా అనే కోణంలో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

అర్థరాత్రి పూట జగన్ ఇంట్లో నుండి అరుపులు రావడంతో దొంగలుగా భావించినట్టు ఇంటి యజమాని చెప్పారు. అయితే అరుపులు పెద్దవి కావడంతో జగన్ ఇంటి తలుపులు తట్టడంతో అప్పటికే జగన్ చనిపోయి ఉన్నాడని ఇంటి యజమాని పోలీసులకు చెప్పారు.

అయతే తాను జగన్ రూమ్ వద్దకు చేరుకొనే సమయంలో ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నట్టు కన్పించారని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తల్లిదండ్రుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకొందని ఈ గొడవలో మా డాడీ మా మమ్మిపై దాడి చేశాడని జగన్ కొడుకు మీడియాకు చెప్పారు. ఈ గొడవలో మా డాడీ కిందపడిపోయాడని ఆ చిన్నారి చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త చదవండి:ఫిల్మ్ నగర్ లో ఘటన: నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసిన దేవిక (వీడియో)