ఫిల్మ్ నగర్ లో ఘటన: నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసిన దేవిక (వీడియో)

Wife kills husband at Film Nagar
Highlights

ఫిల్మ్ నగర్ లో ఘటన: నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసిన దేవిక

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫిలింనగర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత మూడున్నర గంటల ప్రాంతంలో జరిగింది.

దాదాపు 9 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన దేవిక జగన్ ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గత రాత్రి కూడా గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త నోట్లో దేవిక హిట్ కొట్టింది. దాంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దేవికను అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలతో సహా చనిపోదామని తన భర్త జగన్ చెప్పాడని, అందువల్లనే తాను చంపేశానని దేవిక పోలీసులకు చెబుతోంది.

                                         

loader