Asianet News TeluguAsianet News Telugu

జనవరి 3 నుంచి వారికి కూడా Covid వ్యాక్సిన్ : మంత్రి Harish rao

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జ‌న‌వ‌రి 3 నుంచి 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి  టీకా వేస్తామన్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొవిన్ పోర్ట‌ల్ లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల‌ని తెలిపారు. అర్హులైన పిల్లలందరికీ టీకా వేస్తామని, కొవాగ్జిన్‌ టీకాను కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. ముందుగా హైదరాబాద్ తో పాటు మున్సిపాలిటీల్లో PHC, ఆపై స్థాయి ఆస్పత్రిలో ఉన్న చోట్ల వ్యాక్సినేషన్ ప్రారంభమ‌వుతోంద‌ని తెలిపారు.  

covid vaccinations for children from january 3rd minister harish rao
Author
Hyderabad, First Published Dec 28, 2021, 8:56 PM IST

Omicron విజృంభిస్తున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఇక నుంచి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్యశాఖ .. పిల్లలకు వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం.. అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి harish rao  ​ప్రకటించారు.

100శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింద‌ని, ఈ ఘ‌న‌త వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మొద‌టి నుంచి సీఎం కేసీఆర్ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఆయ‌నే స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖలు వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యమయ్యాయని వివరించారు. టీకాపై  ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామ‌నీ, 18 ఏళ్లు దాటిన వారిని వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేశామని తెలిపారు. రాష్ట్రంలో 7,970 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయ‌ని, రాష్ట్రంలో రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలని హరీశ్‌రావు వెల్లడించారు.

Read Also: తెలంగాణలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి.. కండీషన్స్ అప్లయ్

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..  జ‌న‌వ‌రి 3 నుంచి.. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకా వేస్తామన్నారని తెలిపారు. కొవిన్ పోర్ట‌ల్ లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల‌ని తెలిపారు. పీహెచ్‌సీలు, వైద్య కళాశాలలోనూ.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌ని అన్నారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. అర్హులైన పిల్లలందరికీ టీకా వేస్తామని, కొవాగ్జిన్‌ టీకాను కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 15-18 యేండ్ల వయస్సు గ‌ల పిల్ల‌లు  22.78 లక్షల మంది ఉన్నారని,  60 ఏళ్ల పై బడిన వారు 41.60 లక్షల మంది, అలాగే..  హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షల మంది ఉన్నారని తెలిపారు.  

Read Also: 5G Trail Run: Hyderabdలో 5G నెట్ వర్క్ ట్రయల్ రన్

రాష్ట్రంలో కొత్తగా ఏడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, కొత్త కేసులతో మొత్తం సంఖ్య 62కు పెరిగాయన్నారు. 62 మందిలో  46 మంది టీకా తీసుకోలేదని, ట్రావెల్‌ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు  ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. ముందుగా హైదరాబాద్ తో పాటు మున్సిపాలిటీల్లో PHC, ఆపై స్థాయి ఆస్పత్రిలో ఉన్న చోట్ల వ్యాక్సినేషన్ ప్రారంభమ‌వుతోంద‌ని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ‌మ‌వుతోంద‌ని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వేయించుకోవచ్చు .  

Read Also: క్వీన్ ఎలిజబెత్ హత్యకు యత్నించిన 19యేళ్ల బాలుడు.. దానికి ప్రతీకారంగానే..

విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందిని స్క్రీనింగ్‌ చేశామని, టీకా తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 87శాతం టీకాలు అందించింది, ప్రైవేటు వైద్యశాలలు 13శాతం టీకాలు అందించాయని వివరించారు. రాష్ట్రంలో టీకాల కొరత లేదని, 30లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios