Asianet News TeluguAsianet News Telugu

క్వీన్ ఎలిజబెత్ హత్యకు యత్నించిన 19యేళ్ల బాలుడు.. దానికి ప్రతీకారంగానే..

 క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి విండ్సర్ క్యాజిల్ రాజ ప్రసాదానికి క్వీన్ ఎలిజబెత్ వెళ్లారు. శనివారం ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు. చేతిలో విల్లు లాంటి క్రాస్ బౌ ఆయుధం కూడా ఉంది.  రాణి నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 24 నిమిషాల ముందు తీసుకున్న వీడియోను ఆ యువకుడు స్నాప్ చాట్ లో పెట్టాడు

The 19-year-old boy who tried to assassinate Queen Elizabeth is a indian sikh
Author
Hyderabad, First Published Dec 28, 2021, 8:14 AM IST

లండన్ :  బ్రిటన్  రాణి Queen Elizabeth (95)ను murder attempt చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాను indian sikh
నని, తన పేరు జశ్వంత్ సింగ్ ఛాయిల్ అని అతను చెప్పుకొచ్చాడు. 1919 లో జరిగిన Jallianwala Bagh మారణకాండకు ప్రతీకారంగా రాణి హత్య చేయదలచినట్టు పేర్కొన్నాడు.

 ఈ మేరకు స్నాప్ చాట్ లో వీడియో పెట్టాడు.  దీనిని చిత్రీకరించిన సమయంలో పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు అతని మానసిక స్థితి పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి విండ్సర్ క్యాజిల్ రాజ ప్రసాదానికి క్వీన్ ఎలిజబెత్ వెళ్లారు. శనివారం ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు.

 చేతిలో విల్లు లాంటి క్రాస్ బౌ ఆయుధం కూడా ఉంది.  రాణి నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 24 నిమిషాల ముందు తీసుకున్న వీడియోను ఆ యువకుడు స్నాప్ చాట్ లో పెట్టాడు. ‘ నన్ను క్షమించండి.  నేను చేసిన దానికి, చేయబోయే దానికి  క్షమించండి. రాజ కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్ ను హత్య చేస్తాను. 1919 లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండకు ఇది ప్రతీకారం.

Brazil Floods: బ్రెజిల్ ను ముంచెత్తిన వ‌ర‌ద‌లు.. ఎటుచూసినా వ‌ర‌ద నీరే.. !

జాతి పేరుతో వివక్షకు గురై ప్రాణాలు కోల్పోయిన  వారి తరఫున పగ సాధిస్తాను.  నేను భారతీయ సిక్కును.  నా పేరు జస్వంత్ సింగ్ ఛాయిల్- డార్త్ జోన్స్’ అని అందులో పేర్కొన్నాడు. స్టార్ వార్ సినిమా లో ఓ ముసుగు మనిషి నల్లని ఆయుధాన్ని పట్టుకొని భయానక గొంతుతో మాట్లాడినట్టుగా ఈ వీడియో అనిపించింది.  దీన్ని తన ఫాలోవర్స్ కు పంపించాడు.

దాంతో పాటుగా ఓ సందేశం పెట్టాడు. ‘తప్పు చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు క్షమించండి. ఈ వీడియో మీరు అందుకున్నారంటే నా చావు దగ్గర పడినట్టే లెక్క. అవకాశం ఉంటే దీనిని షేర్ చేయండి. ఆసక్తి ఉంటే దీన్ని వార్త ప్రసారం చేయండి. అంటూ అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సౌతాంప్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు జరిపి ఒక క్రాస్ బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios