హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బీజేపీకి తెలంగాణలో ఏమీ లేదని త్వరలో ఆ పార్టీ టూ లెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లోనే రాష్ట్ర బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఏమీ ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. విభజన హామీల సాధన కోసం రాష్ట్ర బీజేపీ ఏమైనా పోరాటం చేసిందా అని నిలదీశారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఎందుకు బీజేపీలో చేర్చుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను చేర్చుకుంటే బీజేపీ బలపడినట్లేనా అని నిలదీశారు. 

బీజేపీలో చేరేవాళ్లంతా కొత్తబిచ్చగాళ్లేనని అభివర్ణించారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ  ఆ పార్టీ కార్యాలయానికి త్వరలో టులెట్‌ బోర్డు పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.