తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు.  2014 ఎన్నికల్లో గెలుపు కోసం తనకు కేసీఆర్ 10 కోట్ల ఆర్థిక సాయం  చేస్తానన్నాడని హోంమంత్రి నాయిని స్వయంగా వెల్లడించాడని...దీన్ని సుమోటాగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశాడు.

తానో ఉద్యమకారుడిని, నీతి నిజాయితీ కల్గిన వ్యక్తిని అని చెప్పుకునే కేసీఆర్ ఎన్నికల నియమాలను ఉల్లంఘించే ఇలాంటి హామీ ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. అంతేకాకుండా తమ పార్టీలోని ఓ సీనియర్ నాయకుడు, మంత్రికి నెల రోజుల నుండి కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నాడని రేవంత్ తెలిపాడు. 

2014 లో తాను ముషీరాబాద్ స్థానం నుండి పోటీ చేస్తానంటే కేసీఆర్ వద్దన్నాడని...ఎల్బీ నగర్ నుండి పోటీ చేయాలని సూచించాడని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్నెస్ పార్టీ నుండి సుధీర్ రెడ్డి వంటి ధనికుడు పోటీచేస్తున్నాడని తాను చెప్పడంతో...నీ గెలుపుకోసం రూ.10 కోట్లు ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్ చెప్పాడని నాయిని మీడియా సమావేశంలో తెలిపాడు. నాయిని మాటపై స్పందించిన రేవంత్... కేసీఆర్ పై కేసు పెట్టాలంటూ పైవిధంగా స్పందించాడు. 

అంతేకాదు టీఆర్‌ఎస్‌ పార్టీలో మొదటినుండి కేసీఆర్ కు వెన్నంటి ఉన్న నాయినికి నెలరోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం అవమానం కాదా అని రేవంత్ ప్రశ్నించాడు. ముషీరాబాద్‌ సీటును అల్లుడికి ఆశించిన నాయినికి కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు

ఎమ్మెల్యే పదవుల కోసం బాబుకు తెలంగాణను తాకట్టు పెడతారా: కేటీఆర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు