హైదరాబాద్: ఇంటి నుండి వెళ్లిపోయే ముందు తన కొడుకును హత్య చేయిస్తానని తన కోడలు బెదిరించిందని.. అన్నట్టుగానే నా కొడుకును చంపించేశారని నందకిషోర్ తల్లి ఆరోపించారు. 

కులాంతర వివాహం చేసుకొన్ననందకిషోర్‌ను శనివారం రాత్రి  ఆయన భార్య బంధువులు  అతి దారుణంగా హత్య చేశారని  నందకిషోర్  తల్లి ఆరోపించారు. నా కోడలు బంధువులు ఫోన్ చేశారని చెప్పి  నందకిషోర్ వెళ్లాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.

నిన్న సాయంత్రం తాను ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పాడని ఆమె చెప్పారు.  కానీ, ఎంతకీ రాకపోవడంతో మరోసారి  తాను ఫోన్ చేయడంతో  తనను  నా కోడలు బంధువులు హత్య చేస్తున్నారని.. పోలీసులను  తీసుకురావాలని  నందకిషోర్ చెప్పాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సంఘటనస్థలానికి చేరుకొనేసరికి  తన కొడుకును చంపేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.  నా కొడుకును చంపిస్తానని నా కోడలు చెప్పినట్టుగా చంపించిందని  ఆమె చెప్పారు.

నాలుగేళ్ల క్రితం ఆశ్వనిని నందకిషోర్  ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. వీరిద్దరివి వేర్వేరు కులాలు. నందకిషోర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆశ్వనికి మరో పెళ్లి చేస్తాం రావాలని కుటుంబసభ్యులు ఆమెను చెప్పేవారు. దీంతో  భార్య, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. 

ఈ రకమైన  గొడవలతోనే మూడు రోజుల క్రితం ఆశ్వని అత్తింటి నుండి పుట్టింటికి వెళ్లింది. దీంతో శనివారం నాడు నందకిషోర్‌ను ఆశ్వని బంధువులు చంపారు.

సంబంధిత వార్తలు

మరో పరువు హత్య: యువకుడ్ని మద్యం తాగించి చంపేశారు

పరువు హత్య: మాట వింటే ఇంటికి, లేదంటే కాటికి

కలమడుగు పరువు హత్య: అనురాధను తల్లే చంపమంది

పరువు హత్య: తల్లితో అనురాధ చివరి మాటలు

పరువు హత్య : చంపేస్తారని ఊహించలేదంటున్న భర్త లక్ష్మీరాజం

పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి