మంచిర్యాల: తాను ప్రేమ వివాహం చేసుకోవడం వల్లే అనురాధను హత్య చేశారని అనురాధ భర్త లక్ష్మీరాజం ఆరోపించారు. తాము గతంలో ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్తానంటే తాను చెప్పమని చెప్తానని తెలిపారు. అనురాధ హత్య ఖచ్చితంగా పరువు కోసమే హత్య చేశారంటూ ఆరోపించారు. 

అయితే తమ ప్రేమ విషయం అనురాధ ఇంట్లో వాళ్లకి తెలిసేసరికి తనపై అక్రమంగా కేసులు పెట్టారని 509 సెక్షన్ కింద తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశారని భర్త లక్ష్మీరాజం ఆరోపించారు. 

తాము డిసెంబర్ 3న ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నట్లు లక్ష్మీరాజం తెలిపారు. వివాహం అనంతరం తాము వరంగల్ లో నెలరోజులపాటు ఉన్నామని అయితే 509 కేసు ఉండటంతో రాజీకోసం తాను వచ్చినట్లు తెలిపారు. 

అయితే తాము ఇంట్లో ఉండగా ఒకరోజు రాత్రి అనురాధ తండ్రి, సోదరుడు, బొంతల మల్లేష్, నక్కా రమేష్ మెుత్తం 20 మంది వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని ఆమెను కొట్టుకుంటూ తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. అయితే చంపేస్తారని తాము ఊహించలేదన్నారు. 

ఇకపోతే తన భార్య అనురాధ గురించి తలచుకుని లక్ష్మీరాజం బోరున విలపించారు. తన భార్య డైట్ చేసిందని ఇటీవల జరిగిన డీఎస్సీలో డిస్ట్రిక్ట్ రాంక్ హోల్డర్ అంటూ చెప్పుకొచ్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తైందని తెలిపారు. 

ఆమె బతికి ఉంటే ఈరోజు గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ బతికి ఉండేవాళ్లమని కానీ ఆమెను భూమి మీదే లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను తనకు దక్కకుండా చేసిన వారందరికి కఠిన శిక్ష పడాలని కోరాడు. 

మరోవైపు అనురాధ పరువు హత్య విషయం దావానంలా వ్యాపించడంతో జన్నారం మండలం కలమడుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనురాధ కుటుంబంపై దాడి జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 

ఇతరులు ఎవరు ఆ ప్రాంతంలో రాకుండా అడ్డుకుంటున్నారు. ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని తెలియడంతో అప్రమత్తమైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు గ్రామస్థులు తమకు సహకరించాలని కోరారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి