హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొన్న లక్ష్మణ్‌ను వదిలేయాలని కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఆమెను చంపేశారు. చంపడానికి ముందు అనురాధను తల్లితో  మాట్లాడించారు. చెప్పినట్టు వినడం లేదు. చంపేయాలని తల్లి చెప్పడంతో అనురాధను తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు.

మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో  కులాంతరం వివాహం చేసుకొన్న అనురాధను  తండ్రితో పాటు కుటుంబసభ్యులు డిసెంబర్ 22వ తేదీన అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 3వ తేదీన హైద్రాబాద్ ఆర్యసమాజ్‌లో అనురాధ, లక్ష్మణ్‌లు పెళ్లి చేసుకొన్నారు.  వరంగల్‌లో వీరిద్దరూ కాపురం పెట్టారు. ఈ నెల 22వ తేదీన గతంలో లక్ష్మణ్‌పై అనురాధ కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు అనురాధ ఈవ్ టీజింగ్ కేసు పెట్టింది.ఆ కేసు రాజీ కోసం మంచిర్యాలకు వచ్చారు.

అదే రోజు సాయంత్రం గ్రామానికి వచ్చారు. వచ్చే సమయంలో పోలీసుల సహాయాన్ని కూడ కోరారు. పోలీసులు కూడ  అనురాధ కుటుంబసభ్యులను  హెచ్చరించారు. దీంతో లక్ష్మణ్, అనురాధలు కలమడుగుకు చేరుకొన్నారు.

లక్ష్మణ్ కుటుంబసభ్యులు నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న సమయంలో  అనురాధ కుటుంబసభ్యులు  అక్కడికి చేరుకొని లక్ష్మణ్ కుటుంబసభ్యులపై దాడి చేసి అనురాధను తీసుకెళ్లారు. అనురాధను చితకబాదుతూ తమ ఇంటికి తీసుకెళ్లారు.

స్థానికులు అడ్డుకొన్నా కూడ అనురాధ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.  అనురాధను స్థానికులు చూడకుండా వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. లక్ష్మణ్‌ను వదిలేయాలని  కోరారు. కానీ,  అనురాధ మాత్రం లక్ష్మణ్‌ను వదిలేసేందుకు ఒప్పుకోలేదు. పరువు అంటూ అనురాధను కుటుంబసభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కానీ, ఆమె మాత్రం లక్ష్మణ్‌ను వదిలేసేందుకు ఒప్పుకోలేదు. అనురాధను  ఒప్పించేందుకు తల్లికి ఫోన్ చేసి అనురాధతో మాట్లాడించారు. తల్లి కూడ అనురాధకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. తనకు లక్ష్మణ్‌తో పెళ్లైందని అనురాధ తల్లికి కూడ తేల్చి చెప్పింది. అనురాధ తన మాట వినకపోవడంతో చెప్పినట్టు వినడం లేదు చంపేయాలని  అనురాధ తండ్రి సత్తెన్నకు ఆయన భార్య చెప్పింది.

తల్లి ఎంత నచ్చచెప్పినా కూడ వినలేదు, మరో వైపు ఆమె చంపేయాలని  చెప్పడంతో  సత్తెన్నలో కోపం  కట్టలు తెంచుకొంది. కూతురును కింద పడేసి గొంతు నులిమి చంపేశారు. క్షణికావేశంలో కూతురును హత్య చేయాలని తల్లి ఆదేశించింది. ఈ ఆదేశాన్ని సత్తెన్న అమలు చేశాడు.

సంబంధిత వార్తలు

పరువు హత్య: తల్లితో అనురాధ చివరి మాటలు

పరువు హత్య : చంపేస్తారని ఊహించలేదంటున్న భర్త లక్ష్మీరాజం

పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి