పరువు హత్య: మాట వింటే ఇంటికి, లేదంటే కాటికి
కులాంతర వివాహం చేసుకొన్న అనురాధను పక్కా ప్లాన్‌తో కుటుంబసభ్యులు హత్య చేశారు.
మంచిర్యాల: కులాంతర వివాహం చేసుకొన్న అనురాధను పక్కా ప్లాన్‌తో కుటుంబసభ్యులు హత్య చేశారు. లక్ష్మణ్‌ను వదిలేస్తామని అనురాధ ఒప్పుకొంటే ఇంటికి తీసుకురావాలనుకొన్నారు. లేకపోతే చంపేయాలని భావించారు. లక్ష్మణ్‌ను వదిలేసేందుకు అనురాధ అంగీకరించకపోవడంతో చంపేశారు.
నాలుగేళ్ల నుండి లక్ష్మణ్, అనురాధలు ప్రేమించుకొంటున్నారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అనురాధతో లక్ష్మణ్‌పై కేసులు పెట్టించారు అనురాధ కుటుంబసభ్యులు.
అయితే లక్ష్మణ్‌ను పెళ్లి చేసుకోవాలని అనురాధ నిర్ణయం తీసుకొంది. అనురాధ లక్ష్మణ్‌ను ఈ నెల 3వ తేదీన హైద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకొంది.
వీరిద్దరూ కూడ హైద్రాబాద్‌లోనే చదువుకొనేవారు. పెళ్లి చేసుకొన్న తర్వాత వీరిద్దరూ కూడ వరంగల్ లో కాపురం పెట్టారు.గతంలో లక్ష్మణ్‌పై నమోదైన కేసు రాజీ కోసం మంచిర్యాలకు వచ్చారు.
మంచిర్యాలకు రావడంతో స్వగ్రామానికి వచ్చి అనురాధ తన ప్రాణాలను కోల్పోయింది. లక్ష్మణ్ ఇంట్లో కొత్త దంపతులను ఆశీర్వదిస్తున్న సమయంలో అనురాధ కుటుంబసభ్యులు ఆమెను తీసుకెళ్లారు.
కులాంతర వివాహం చేసుకొందనే ఉద్దేశ్యంతోనే అనురాధను చంపాలని కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. కొట్టుకొంటూ అనురాధను తీసుకెళ్లారు. వ్యవసాయ భావి వద్దకు తీసుకెళ్లారు. లక్ష్మణ్‌ను వదిలేయాలని కోరారు. తండ్రితో పాటు కుటుంబసభ్యులు చెప్పినా కూడ అనురాధ ఒప్పుకోలేదు. లక్ష్మణ్‌తోనే తన చావైనా బతుకైనా అంటూ ఆమె తేల్చి చెప్పేసింది.
అయితే అనురాధను ఇంటి నుండి తీసుకెళ్లే సమయంలో తాము చెప్పినట్టు వింటే ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేసుకొన్నారు. కానీ తాము చెప్పినట్టుగా వినకపోతే చంపేయాలని ప్లాన్ చేశారు. అనురాధను వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లగానే కట్టెలు కూడ రెడీ చేసుకొన్నారు.ఆమె మృతదేహన్ని దగ్దం చేసేందుకు ఈ కట్టెలను రెడీ చేసుకొన్నారు.
తండ్రి సత్తెన్న, సోదరుడు, బంధువులు కూడ అనురాధకు నచ్చచెప్పారు. చివరకు తల్లితో కూడ ఫోన్లో మాట్లాడించారు. లక్ష్మణ్‌ను వదిలే సమస్యే లేదని అనురాధ చెప్పడంతో తమ ప్లాన్ ను అమలు చేశారని పోలీసులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
కలమడుగు పరువు హత్య: అనురాధను తల్లే చంపమంది
పరువు హత్య: తల్లితో అనురాధ చివరి మాటలు
పరువు హత్య : చంపేస్తారని ఊహించలేదంటున్న భర్త లక్ష్మీరాజం
పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో
పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్
ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు
ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్
ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...
అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్
అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు
పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి