శంషాబాద్ విమానాశ్రయం నుండి థాయిలాండ్ కు 133 ప్రయాణికులతో వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నాయి. 

Hyderabad : హైదరాబాద్ నుండి థాయిలాండ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం భారీ కుదుపులకు గురవుతూ హార్డ్ ల్యాండింగ్ అయ్యింది... అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో 100 మందికిపైగా ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. ఈ ఘటన ఇవాళ (మార్చి 11, బుధవారం) పుకెట్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగింది..?

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం పుండి 133 ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 737 విమానం థాయిలాండ్ బయలుదేరింది. బయలుదేరే సమయంలో, ప్రయాణంలో ఎలాంటి సమస్యా లేదు... కానీ ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం సాప్ట్ ల్యాండింగ్ కాలేకపోయింది... వేగంగా దూసుకువచ్చి రన్ వే ను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం ముందుభాగం చక్రం ఊడిపోయింది. అలాగే వెనకాల చక్రాలు కూడా బ్లాస్ట్ అయ్యాయి.

ప్రయాణికులు సేఫ్

భారీ కుదుపులకు గురయిన విమానం ఎట్టకేలకు కొంతదూరం దూసుకెళ్లి రన్ వే పైపే ఆగిపోయింది...దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే పుకెట్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను విమానంలోంచి వెంటనే బైటకు తీసుకువచ్చారు. ఈ ఘటనతో పుకెట్ విమానాశ్రయ రన్ వే ను మూసివేశారు. ఈ ఘటనకు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నంచేస్తోంది ఎయిరిండియా.