Revanth Reddy...సచివాలయం గేట్లు బద్దలు కొట్టి సామాన్యులకు స్వాగతం: రేవంత్ రెడ్డి (వీడియో)
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి తమ బాధ్యతను మరింత పెంచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
హైద్రాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో ఆదివారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తాను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పార్టీని ముందుకు నడిపించినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.
also read:N.Uttam Kumar Reddy..నెరవేరిన శపథం: గడ్డం తీయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
తమ కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయని ఆయన చెప్పారు.ప్రగతి భవన్ పేరును డాక్టర్ అంబేద్కర్ భవన్ గా మారుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రగతి భవన్ కాదు, ఇకపై అది ప్రజా భవన్ అని ఆయన చెప్పారు.భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్పూర్తి నింపారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ ఎన్నికల ఫలితాలను తెలంగాణ అమరులకు అంకితం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
also read:Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్
ఏ సమస్యలు వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ విజయంలో 30 లక్షల నిరుద్యోగుల పట్టుదల ఉందని చెప్పారు.
also read:Telangana Assembly Election Results 2023 LIVE : కాసేపట్లో కేసీఆర్ రాజీనామా..?...
అంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ నేతృత్వంలో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు.