Asianet News TeluguAsianet News Telugu

N.Uttam Kumar Reddy..నెరవేరిన శపథం: గడ్డం తీయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నేత  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయనున్నారు. గత ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ  ఓడిపోతే  గడ్డం  తీయనని చెప్పారు. ఐదేళ్ల పాటు గడ్డం తీయకుండా ఉన్నారు.  

 Telangana Election Results 2023: N.Uttam Kumar Reddy will shave his beard lns
Author
First Published Dec 3, 2023, 3:36 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  గడ్డం తీయనున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించకపోతే  తాను  గడ్డం తీయబోనని  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి.

also read:Kodad Assembly Segment... కోదాడ నుండి ఎమ్మెల్యేలుగా: 2014లో అసెంబ్లీకి ఎన్. ఉత్తమ్,పద్మావతి దంపతులు

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అప్పట్లో కాంగ్రెస్ భావించింది. అయితే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు  వేలు పెడుతున్నారని తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ రగిల్చారు.  ఇంకా ఆంధ్రవాళ్ల పెత్తనం మనకు అవసరమా  అని  ఆయన  ప్రశ్నించారు.ఈ ఎన్నికల్లో  కేసీఆర్ చేసిన ప్రచారం  తెలంగాణలో  బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది.  దీంతో కాంగ్రెస్ పార్టీ  21 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విజయం సాధించకపోవడంతో  ఉత్తమ్ కుమార్ రెడ్డి  గడ్డం తీయడం లేదు. 

also read:Huzurnagar assembly results 2023: హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..ఉత్తమ్ గెలుపు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకొంది. దరిమిలా  ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయనున్నారు. రెండు మూడు రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి  గడ్డం తీయనున్నారు.  గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేసిన ప్రతిన విషయంలో ఆయన భార్య పద్మావతి  వారించారు. అయినా కూడ  ఉత్తమ్ కుమార్ రెడ్డి  తన ప్రతినకు కట్టుబడి ఉన్నారు.  రెండు మూడు రోజుల్లో  గడ్డం తీయనున్నారు.

also read:Telangana Assembly Election Results 2023 LIVE : ‘‘ థ్యాంక్స్ ’’ అంటూ కేటీఆర్ ట్వీట్...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్  30న  పోలింగ్ జరిగింది.  రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి అస్త్రశస్త్రాలను సంధించింది.  కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని  పార్టీ నాయకత్వం  ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో తెలంగాణలో  పట్టు సాధించాలని  బీజేపీ నాయకత్వం  అన్ని అస్త్రాలను ప్రయోగించింది.  ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి.  బీజేపీ  111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ,సీపీఐ మధ్య ఈ ఎన్నికల్లో పొత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో పోటీ చేయగా, సీపీఐ ఒక్క స్థానంలో బరిలోకి దిగింది.  ఈ ఎన్నికల్లో సీపీఐఎం, బీఎస్ పీ ఒంటరిగా బరిలోకి దిగింది.
 

 


 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios