సారాంశం

రెండు రోజులుగా  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  తెలంగాణలో  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  కేసీఆర్ సర్కార్ పై అమిత్ షా విమర్శలు చేస్తున్నారు. 

మక్తల్:కేసీఆర్ సర్కార్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని  కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా  విమర్శించారు.కేసీఆర్ ను ఇంటికి సాగనంపే  సమయం వచ్చిందన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో  ఆదివారంనాడు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ  విజయ సంకల్ప సభలో  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 

 

కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని  అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలోని మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూకబ్జాలకు అడ్డు లేకుండా పోయిందని అమిత్ షా ఆరోపించారు.ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని  అమిత్ షా పేర్కొన్నారు. ప్రజల పనులు చేయకుండా  దందాలు చేయడమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విధానమని ఆయన  విమర్శించారు.

also read:Telangana assembly Elections 2023: ఓటరు గుర్తింపు కార్డు లేదా... ఈ కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

బీజేపీ గెలిస్తే  మక్తల్, నారాయణపేటలో టెక్స్ టైల్స్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని  అమిత్ షా హామీ ఇచ్చారు.మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం అభివృద్ది చెందలేదని  అమిత్ షా  విమర్శించారు.

also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?

 కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని  అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ కు బీ టీమ్ వంటిందని  అమిత్ షా ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ  తమ వారసుల గురించే ఆలోచిస్తారని అమిత్ షా  విమర్శించారు.ఢిల్లీలో రాహుల్ ను, రాష్ట్రంలో కేటీఆర్ ను పదవిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాయని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో  బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీయేనని ఆయన  చెప్పారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే  ఏడాదికి  నాలుగు గ్యాస్ సిలిండర్లను  పేదలకు  ఉచితంగా అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలా వద్దా అని ఆయన  ప్రశ్నించారు.ఎంఐఎం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయమని అమిత్ షా విమర్శించారు.బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎప్పుడూ మజ్లిస్ చేతిలోనే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే  నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని  అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి  22న అయోధ్యలో రామమందిరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణపత్రిష్ట చేస్తారని  అమిత్ షా తెలిపారు.