ఓటు హక్కును వినియోగించుకొనే సమయంలో  ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా  ఇతర ప్రత్యామ్నాయ కార్డులను ఉపయోగించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

హైదరాబాద్:ఈ నెల  30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ రోజున ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేసే అవకాశం ఉందా  అనే అనుమానాలు కూడ వస్తాయి.  ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా  కొన్ని గుర్తింపు కార్డులను చూపి ఓటు హక్కును నమోదు చేసుకొనే అవకాశం ఉంది.


1. ఆధార్ కార్డు
2.డ్రైవింగ్ లైసెన్స్ 
3.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన  ఫోటో గుర్తింపు కార్డులు
4.బ్యాంకులేదా పోస్టాపీస్ జారీ చేసిన పాస్ పుస్తకాలు
5.ఉపాధి హామీ జాబ్ కార్డు
6.కార్మిక శాఖ జారీ చేసిన స్మార్ట్ కార్డు
8.ఎన్‌పీఆర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.తెలంగాణాలో 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.59 వేల బ్యాలెట్ యూనిట్లు ఉపయోగిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఆధార్, పాన్, బ్యాంకు పాస్ పుస్తకాల వంటి గుర్తింపు కార్డులను చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

తెలంగాణలో పురుష ఓటర్ల కంటే  మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ దఫా హోం ఓటింగ్ ను  కూడ  ప్రారంభించారు. 90 వేలకు పైగా  మందికి హోం ఓటింగ్ అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.

తెలంగాణలో  ఎన్నికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  అంతేకాదు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో  బందోబస్తును పెంచారు.