సారాంశం

ఎన్నికల సభల్లో కాంగ్రెస్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సూటిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో  కేసీఆర్ పాల్గొన్నారు.
 

ఇబ్రహీపట్టణం:50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది.  మన బతుకులు మారాయా అని  తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రజలను ప్రశ్నించారు.ఎవరి చేతిలో పెడితే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచన చేయాలని  ఆయన సూచించారు.

మంగళవారంనాడు  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.కాంగ్రెస్ పాలనలో  తాగు, సాగు నీటి , విద్యుత్ సంగతి మీకు తెలిసిందేనని ఆయన  ఎద్దేవా చేశారు.మరోసారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారన్నారు.  తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు.

వ్యవసాయానికి  24 గంటల విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చేస్తున్న ప్రచారం గురించి కేసీఆర్  గుర్తు చేశారు.  24 గంటల విద్యుత్ కావాలా వద్దా అని ఆయన అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ధరణి పోర్టల్ తీసివేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి  చెబుతున్నారన్నారు. 

ధరణి తీసుకువచ్చిన వాళ్లు కావాలా, ధరణిని బంగాళాఖాతంలో  వేస్తామన్న వాళ్లు కావాలో తేల్చుకోవాలని  కేసీఆర్ ప్రజలను కోరారు. ధరణితో రైతులు నిశ్చింతగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ధరణిని తీసివేస్తే  రైతుబంధు  ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.ధరణి లేకపోతే ఎవరి భూమి ఎవరికి వెళ్తుందో  తెలియని  పరిస్థితి ఉందన్నారు.

 

సామాజిక బాధ్యతలో భాగంగానే పేదల పెన్షన్లు పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు.మరోసారి అధికారంలోకి రాగానే  పెన్షన్ ను రూ. 5 వేలకు పెంచుతామని ఆయన  హామీ ఇచ్చారు.అభివృద్దిలో ముందుకే వెళ్లాలి.. వెనక్కి పోవద్దని  కేసీఆర్ చెప్పారు.తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని  ఆయన ప్రజలను కోరారు.

also read:కాంగ్రెస్ నేతలే సంపన్నులు: వివేక్ టాప్, ఆ తర్వాతి స్థానాల్లో పొంగులేటి, కోమటిరెడ్డి

ప్రజాస్వామ్యంలో ఏకైక ఆయుధం ఓటు...మన తలరాతను మార్చేది ఓటన్నారు.ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.దేశంలో  ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీల చరిత్ర కచ్చితంగా  చూడాలని కేసీఆర్ కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  పదేళ్లుగా  పేదల సంక్షేమ పాలన అందించినట్టుగా  చెప్పారు.

also read:2004 నుండి సిద్దిపేట నుండి హరీష్ రావు వరుస విజయాలు: 2018లో రికార్డు మెజారిటీ

తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు.తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,200 యూనిట్లుగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపేందుకు  కాంగ్రెస్ నేతలు  196 కేసులు వేశారని కేసీఆర్ విమర్శించారు.