Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో సంబరాలు, మాది ‘‘సీఎం గారి వూరు ’’ అంటోన్న గ్రామస్తులు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.  ఇక ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపై మా వూరు కొండారెడ్డిపల్లి కాదని, సీఎం వూరని చెబుతున్నారు.

kondareddy palli village celebrating as Anumula Revanth reddy appointed as Telangana Chief minister ksp
Author
First Published Dec 5, 2023, 7:51 PM IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. మా రేవంత్ పటేల్ .. సీఎం అయ్యాడని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకేనని వారు అంటున్నారు. రేవంత్ అప్పటికీ, ఇప్పటికీ మా మంచి పటేలే అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇకపై మా వూరు కొండారెడ్డిపల్లి కాదని, సీఎం వూరని చెబుతున్నారు. ఎప్పుడు ఆయన ఊరికి వచ్చినా ఎంతో అప్యాయంగా పలకరిస్తారని తెలిపారు. 

Also Read: Breaking News : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం

అంతకుముందు సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. నిన్న సీఎల్పీ మీటింగ్ జరిగిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమకు అధికారాన్ని అప్పగించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీసుకున్నారని వేణుగోపాల్ వెల్లడించారు. 

మంగళవారం ఉదయం నుంచి ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో  సీఎం ఎంపికపై చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని వేణుగోపాల్ అన్నారు. డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు.      

Follow Us:
Download App:
  • android
  • ios