Narendra Modi..ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ: తూఫ్రాన్ సభలో నరేంద్ర మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో రెండు రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు.
మెదక్: గతంలో అసమర్థ ప్రభుత్వం వల్లే నవంబర్ 26న దేశంలో ఉగ్రదాడి జరిగిందనిఉమ్మడి మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ లో ఆదివారంనాడు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.తెలంగాణలో ఈ సారి ఒక కొత్త సంకల్పం కన్పిస్తుందన్నారు.తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజల్లో సంకల్పం మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో నవంబర్ 26న దురదృష్టకర ఘటన జరిగిందన్నారు. 2014లో అసమర్థ ప్రభుత్వాన్ని గద్దెదించి సమర్థవంతమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టుగా మోడీ గుర్తు చేశారు.కేసీఆర్ రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా అని మోడీ ప్రశ్నించారు.ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
గజ్వేల్ లో పోటీ చేస్తున్న బీజేపీ సింహం ఈటల రాజేందర్ ను చూసి కేసీఆర్ భయపడ్డారని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు.భూనిర్వాసితులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆ్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోరన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థ నాశనమైందని నరేంద్ర మోడీ విమర్శించారు.
ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా అని తెలుగులో ప్రశ్నించారు ప్రధానమంత్రి మోడీ.ఎప్పుడూ సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా అని ఆయన అడిగారు.ఎప్పుడూ ఫామ్ లో ఉండే సీఎం మనకు అవసరమా అని మోడీ ప్రశ్నించారు.
also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ
బీసీల్లో ఎంతో ప్రతిభావంతులున్నా ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదని మోడీ అభిప్రాయపడ్డారు.సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని మోడీ పేర్కొన్నారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ధైర్యంగా బీజేపీ మాత్రమే ప్రకటించిందని మోడీ గుర్తు చేశారు.
తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ అర్ధం చేసుకుందని చెప్పారు.త్వరలో మాదిగలకు న్యాయం చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని నరేంద్ర మోడీ చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ ఒక్కటేనని చెప్పారు.ఈ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని మోడీ కోరారు.కుటుంబ పార్టీలు వారసుల గురించి మాత్రమే ఆలోచిస్తాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పెద్దగా తేడా లేదన్నారు.కాంగ్రెస్ సుల్తానులను పెంచి పోషిస్తే బీఆర్ఎస్ నిజాంలను పోషించిందని మోడీ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బోఫోర్స్ వంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?
దేశంలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడితే రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను తెచ్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నిధులన్ని కేసీఆర్ కుటుంబానికి వెళ్లినట్టుగా మోడీ చెప్పారు.నీళ్ల పేరు చెప్పి నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నారని మోడీ విమర్శించారు.గ్రూప్ 1 వంటి పరీక్ష పేపర్లు లీకై ఉద్యోగ నియామకాలు జరగలేదని మోడీ చెప్పారు.
తెలంగాణను లూటీ చేసిన తర్వాత కేసీఆర్ దృష్టి దేశంపై పడిందని మోడీ ఆరోపించారు.దేశాన్ని కూడా లూటీ చేసేందుకు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఓ నేతతో చేయి కలిపారని ఆయన విమర్శించారు.ఢిల్లీలో ఓ నేతతో చేతులు కలిపి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.
రైతులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని మోడీ చెప్పారు.చిన్న రైతులను ఆదుకొనేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని మోడీ గుర్తు చేశారు.తెలంగాణ రైతులను ఆదుకొనేందుకు 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనాలని నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలిపారు.