Yogi Adityanath..రైతులు, పేదల సంక్షేమం కోసం పాటుపడుతాం: కాగజ్ నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాగజ్ నగర్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
కాగజ్ నగర్:రైతులు, పేదల సంక్షేమం గురించి ఆలోచించేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని ఆయన చెప్పారు.కుమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ , ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో శనివారంనాడు బీజేపీ నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని విశ్వసించబోవన్నారు. అంబేద్కర్ కు నిజమైన గౌరవం కల్పించింది బీజేపీ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.
తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీ సర్కార్ దని ఆయన గుర్తు చేశారు.కరోనా సమయంలో మోడీ ప్రభుత్వం దేశమంతా ఉచితంగా రేషన్ బియ్యం అందించిందన్నారు.
also read:Amit Shah.... కేటీఆర్ ను సీఎం చేయడంపైనే కేసీఆర్ ధ్యాస: కొల్లాపూర్ సభలో అమిత్ షా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందా అని ఆయన అడిగారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి హమీని అమలు చేస్తామన్నారు.
ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ ఆవిర్భవించిందని యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి భారత రాష్ట్ర సమితి మోసం చేస్తుందని ఆయన విమర్శించారు.ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.బీజేపీ గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.నీళ్లు, నిధులు నియామకాల డిమాండ్ తో రాష్ట్రం ఏర్పడిందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.నీళ్లు, నిధులు నియామకాలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.