KCR : రెండు రోజులు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే - కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి ఎవరూ ఆందోళన చెందకూడదని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. రెండు రోజులు ఓపిక పట్టాలని, మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు.
kalvakuntla chandrashekar rao : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు (Telangana assembly elections 2023) గురువారం ప్రశాంతంగా ముగిశాయి. నేతల భవితవ్యం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయో ? ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందో తెలియాలంటే ఆదివారం సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిందే. నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఫలితాల్లో దాదాపు అన్ని ప్రధాన సర్వే సంస్థలూ కాంగ్రెస్ కే మెజారిటీ దక్కుతుందని అంచనా వేశాయి.
అధికార బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) నేతలను కలవరపెడుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, వాస్తవ ఫలితాలను ఎంత వరకు ప్రతిబింబిస్తాయనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ అంచనాలు ఎక్కడ నిజమవుతాయో అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఫేక్ అని, తమ పార్టీయే అధికారం చేపట్టబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ధీమా వ్యక్తం చేశారు.
Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..
సీఎం కేసీఆర్ (CM KCR) కూడా ఇదే విషయాన్ని ప్రగతి భవన్ (Pragathi bhavan)లో పార్టీ నాయకులతో శుక్రవారం చెప్పారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ పై చర్చించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పలువురు అభ్యర్థులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ నాయకులకు సీఎం ధైర్యం చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తేల్చి చెప్పారు.
kt rama rao : చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయా - కేటీఆర్
రెండు రోజులు ఓపిక పట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. ఫలితాలు వెలువడిన 3వ తేదీ (counting day)న అందరం కలిసి సంబరాలు జరుపుకుందామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు కూడా తెలంగాణకు బీఆర్ఎస్ సుపరిపాలన అందించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ ఆందోళన చెందకూడదని పేర్కొన్నారు.