రాహుల్ గాంధీకి ఉద్యోగమంటే ఏంటో తెలుసా ? కర్ణాటకలో ఒక్క జాబ్ నోటిఫికేషనైనా ఇచ్చారా ?- మంత్రి కేటీఆర్
కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పటి వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి అసలు ఉద్యోగం అంటే ఏమిటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఉద్యోగమంటే ఏంటో తెలుసా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
నెలరోజు పాటు డిజిటల్ చెల్లింపులు చేయండి.. ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
ఐటీ రైడ్ లు కాంగ్రెస్ నాయకులపై మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పడం వాస్తవం కాదని అన్నారు. రాష్ట్రానికి స్వీయ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే నవంబర్ 29వ తేదీన దీక్షా దినాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ దీక్షతోనే నవంబర్ 29న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కీలక ప్రకటన చేసిందని చెప్పారు.
Birth Day: బర్త్ డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భార్య పిడిగుద్దులు.. ముక్కు పగిలి భర్త మరణం
ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎక్కడి వారు అక్కడ ఈ దీక్షా దినాన్ని జరుపుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. హాస్పిటల్స్ లో పేషంట్లకు పండ్లు పంపిణీ చేయాలని, ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. కోరుట్ల, గోషామహల్, కరీంనగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండియేట్ లను నిలబెట్టిందని ఆయన ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీ అంటే ప్రేమ అని అన్నారు.
ఇప్పటికే మీకు 50 ఏళ్లు.. ప్లీజ్ ఇకపై ఒంటరిగా ఉండొద్దు - రాహుల్ గాంధీకి ఓవైసీ సెటైర్లు..
గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ క్యాండియేట్ ను బీఆర్ఎస్ ఓడిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిన పథకం కాదని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న స్కీమ్ లకు ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన అన్నారు.
అనంతరం రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆయన ఎప్పుడైనా జాబ్ చేశారా అని ప్రశ్నించారు. అసలు అప్లయ్ కూడా చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీకి ఉద్యోమంటే ఏంటో కూడా తెలియదని తెలిపారు. తాను పోటీ పరీక్షలు రాశానని, జాబ్ కూడా చేశానని అన్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో రెండు లక్షల జాబ్ లకు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు.