Uttarkashi tunnel collapse: సొరంగం కూలిన ఘటన.. సహాయక చర్యలు మరింత ఆలస్యం.. నేటి నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్
Uttarkashi tunnel collapse: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సొరంగం కుప్పకూలి ఇప్పటికీ రెండు వారాలు గడిచింది. రెస్క్యూ పనులకు అవాంతరాలు ఏర్పడుతుండటంతో అప్పటి నుంచి కార్మికులు అందులోనే బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు.
Uttarkashi tunnel collapse : ఉత్తరాఖండ్ లోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను వెలికితీసే సహాయక చర్యలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నెల 12వ తేదీన ఘటన జరగ్గా.. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా.. అది పలు పరిమాణాలతో ముగిశాయి. దీంతో లోపల చిక్కుకున్న కార్మికుల ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నించారు. కార్మికుల కోసం మొబైల్ ఫోన్లు, బోర్డ్ గేమ్స్ పంపించారు. వారి కోసం ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ పంపించే ప్రక్రియ నిరంతరం సాగుతోంది.
Birth Day: బర్త్ డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భార్య పిడిగుద్దులు.. ముక్కు పగిలి భర్త మరణం
శుక్రవారం సాయంత్రం అమెరికాకు చెందిన డ్రిల్లింగ్ యంత్రంతో రెస్యూ పనులు చేపట్టారు. అయితే ఆ యంత్రం మెటల్ గర్డర్ ను ఢీకొట్టడంతో సహాయక చర్యలకు అతిపెద్ద అడ్డంకి ఎదురైంది. దీంతో డ్రిల్లింగ్ నిలిచిపోవడంతో ఆపరేషన్ నిలిపివేశారు. ఇప్పుడు మ్యానువల్ డ్రిల్లింగ్ ద్వారా ఈ రెస్క్యూ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ముగిసిన రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం.. కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ.. ఎవరిపై ఇంట్రెస్ట్ చూపుతోందంటే ?
కాగా.. 2వ లైఫ్ లైన్ సర్వీసును ఉపయోగించి తాజాగా వండిన ఆహారం, తాజా పండ్లను క్రమం తప్పకుండా సొరంగం లోపలకు పంపిస్తున్నారున. నారింజ, ఆపిల్, అరటి వంటి పండ్లతో పాటు మందులు, లిక్విడ్ లను కూడా క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నారు.
ఫ్యూచర్ స్టాక్ కోసం అదనపు డ్రై ఫుడ్ కూడా అందిస్తున్నారు. నిరంతర కమ్యూనికేషన్స్ కోసం ఎస్డీఆర్ఎఫ్ అభివృద్ధి చేసిన వైర్ కనెక్టివిటీతో మాడిఫైడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారు.
ముగిసిన రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం.. కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ.. ఎవరిపై ఇంట్రెస్ట్ చూపుతోందంటే ?
కాగా.. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ ఆటా హస్నైన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్ కు ఇంకా చాలా సమయం పట్టవచ్చని తెలిపారు. మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా కార్మికులు రెస్క్యూ ప్యాసేజ్ ఇప్పటికే బోర్ కొట్టిన 47 మీటర్ల మార్గంలోకి ప్రవేశించి, పరిమిత ప్రదేశంలో కొద్దిసేపు డ్రిల్లింగ్ చేసి, తరువాత కార్మికులను బయటకు తీసుకొని వస్తారని చెప్పారు.