Asianet News TeluguAsianet News Telugu

CPI Narayana : జగన్ కు ఇప్పుడే ఎందుకు నీళ్లు గుర్తొచ్చాయ్.. కేసీఆర్ ను గెలిపించేందుకే ఈ కుట్ర - సీపీఐ నారాయణ

తెలంగాణలో కేసీఆర్ ను గెలిపించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ నాగార్జున సాగర్ ఆనకట్టపై వివాదం రేకెత్తించారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

CPI Narayana: Why did Jagan remember water now.. This conspiracy is to win KCR - CPI Narayana..ISR
Author
First Published Dec 1, 2023, 3:10 PM IST

నాగార్జున సాగర్ ఆనకట్టపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ (CPI National General Secretary Narayana) స్పందించారు. తెలంగాణలో పోలింగ్ (telangana assembly elections 2023)కు, ఈ వివాదానికి సంబంధం ఉందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపించేందుకు వైఎస్ జగన్ (ys jagan) ఈ కుట్ర పన్నారని అన్నారు. హైదరాబాద్ లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

webcam in ladies bathroom : లేడీస్ బాత్ రూమ్ లో వెబ్ క్యామ్.. ప్రియుడు చెప్పాడనే ప్రియురాలి దురాగతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఇంత కాలం వైఎస్ జగన్ విస్మరించారని సీపీఐ నారాయణ ఆరోపించారు. కానీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఈ నీళ్ల విషయం ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. పోలింగ్ సమయంలో నీటిని అడ్డం పెట్టుకొని ఏపీ ప్రభుత్వం (Andhra pradesh government) నాటకాలు ఆడిందని ఆరోపించారు. కానీ ప్రయత్నాలు బెడిసికొట్టాయని విమర్శించారు. 

Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..

అనంతరం తెలంగాణలో జరిగిన పోలింగ్ పై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ (congress party) తమ ఎమ్మెల్యేలను క్యాంప్ నకు తరలించాలని భావిస్తోందని నారాయణ అన్నారు. తమ పార్టీ అభ్యర్థి సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లే క్యాంప్ నకు సాంబశివరావు (samba shivar rao) వెళ్లబోరని అన్నారు. 

kt rama rao : చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయా - కేటీఆర్

తెలంగాణలో హంగ్ రాబోదని, కాంగ్రెస్ పార్టీ (congress party) కే మెజారిటీ రాబోతోందని నారాయణ అన్నారు. ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలంగాణను పాలించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని శాసన సభాపక్ష నేతగా కేసీఆర్ (KCR) ఆహ్వానించే పరిస్థితి రాబోతుందని తెలిపారు. నియంత లాంటి కేసీఆర్ కంటే.. ఐదు సంవత్సరాల్లో ఐదుగురు సీఎంలు వచ్చినా పరవాలేదని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios