తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థులు  ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్  ఆదివారంనాడు  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తదితరులు  కలిశారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అంజనీకుమార్ అభినందించారు. 

హైదరాబాద్:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆదివారం నాడు చేరుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతుంది. సుమారు 65కు పైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతునన్నారు.

Scroll to load tweet…

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్ , సంజయ్ కుమార్ జైన్ లు కూడ రేవంత్ రెడ్డిని కలిశారు.తెలంగాణలో కాంగ్రెస్ విజయం వైపునకు దూసుకెళ్తున్న తరుణంలో డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర ఐపీఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. ఇవాళ ఉదయం నుండి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆధిక్యంలో కొనసాగుతున్నారని తెలుసుకుని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 

also read:Paleru Election Result 2023:పాలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి అస్త్రశస్త్రాలను సంధించింది. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో తెలంగాణలో పట్టు సాధించాలని బీజేపీ నాయకత్వం అన్ని అస్త్రాలను ప్రయోగించింది.

also read:Telangana Assembly Election Results 2023 LIVE : రేవంత్ రెడ్డి ఇంటికి డిజిపి అంజనీ కుమార్...

ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ,సీపీఐ మధ్య ఈ ఎన్నికల్లో పొత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో పోటీ చేయగా, సీపీఐ ఒక్క స్థానంలో బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో సీపీఐఎం, బీఎస్ పీ ఒంటరిగా బరిలోకి దిగింది.