Asianet News TeluguAsianet News Telugu

2004 సెంటిమెంట్ రీపీట్:తెలంగాణలో హస్తం హవా

2004 నాటి సెంటిమెంట్ రీపీట్ అయింది.  2023 లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జోష్ నింపింది. 

2004 Congress sentiment repeated in 2023 elections in Telangana and karnataka Elections 2023 lns
Author
First Published Dec 5, 2023, 10:14 AM IST

హైదరాబాద్: 2004 నాటి  సెంటిమెంట్  2023లో పునరావృతమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2023 ఎన్నికల్లో కూడ  తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు  2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.  ఆ ఎన్నికల్లో ఇతర  విపక్షాలతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. 

ఈ రెండు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ  ఏర్పాటు సమయాల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో  కూడ  ఒకే తరహా  ఫార్మూలాను అవలంభించారు. ఈ వ్యూహాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి.  

1994 నుండి  2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.   ఈ సమయంలో  శాసనసభపక్ష నేతగా ఉన్న  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర అప్పట్లో కాంగ్రెస్ కు  రాజకీయంగా  కలిసి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజశేఖర్ రెడ్డి  పేరును  ముందువరసలో నిలిచేందుకు  ఈ పాదయాత్ర అప్పట్లో దోహదపడింది.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఆరు మాసాల ముందే  కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆనాడు కర్ణాటక రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి  గులాం నబీ ఆజాద్  అవలంభించిన ఫార్మూలా ఆ పార్టీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య ఐక్యత తీసుకు వచ్చారు.  ఇందు కోసం  కాంగ్రెస్ సీనియర్లతో  బస్సు యాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా  నిర్వహించిన బస్సు యాత్ర  అప్పట్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ  విజయంలో కీలకపాత్ర పోషించింది.  కర్ణాటకలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి   కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా  గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ ను నియమించింది.  కర్ణాటక ఫార్మూలానే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఆనాడు ఆజాద్ అవలంభించారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం  పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

2023లో  కూడ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ ఒకే రకమైన ఫార్మూలాను అవలంభించింది.ఈ ఫార్మూలా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ  విజయానికి కారణమైంది.

2004 Congress sentiment repeated in 2023 elections in Telangana and karnataka Elections 2023 lns

ఈ ఏడాది మే మాసంలో జరిగిన ఎన్నాకల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  కర్ణాటకలో ఐదు గ్యారంటీలను  కాంగ్రెస్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. సిద్దరామయ్య, డీకే శివరామయ్య సహా  ఇతర నేతల మధ్య ఐక్యత ఆ పార్టీకి కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు  కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రయోగాలన్నీ కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చాయి. 

also read:Telangana assembly Elections 2023:2004 సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?

ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  2004 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  లెఫ్ట్ సహా ఇతర విపక్షాల సహకారంతో  యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది.  ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లు కీలక పాత్ర పోషించాయి.  2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే  విపక్షాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ  ఇండియా కూటమిగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి  అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. అయితే  తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి  ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

also read:నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ

కర్ణాటకలో అవలంభించిన ఫార్మూలానే  తెలంగాణలో కూడ కాంగ్రెస్ అమలు చేసింది.   తెలంగాణలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో  కాంగ్రెస్ నేతల మధ్య  ఐక్యత కూడ  ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపింది. దీనికి తోడు  ప్రత్యర్థులపై  ఎదురుదాడి వ్యూహం కూడ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.  

also read: Errabelli dayakar Rao..డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించిన యశస్విని: ఎవరీ యశస్విని రెడ్డి

2004 సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.  2023 ఎన్నికల్లో కూడ  2004 సెంటిమెంట్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చింది.  2004 ఎన్నికల సమయంలో ఈ రెండు రాష్ట్రాలకు  గులాం నబీ ఆజాద్  ఇంచార్జీగా వ్యవహరించారు. అయితే ఈ దఫా మాత్రం ఈ రెండు రాష్ట్రాలకు  వేర్వేరు నేతల ఇంచార్జీలుగా ఉన్నారు.  కానీ, ఈ రెండు రాష్ట్రాల్లో  2004, 2023 ఎన్నికల్లో ఒకే రకమైన ఫార్మూలాను అవలంభించారు.ఈ ఫార్మూలా  కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు దోహదపడింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios