ఖమ్మం: మారిన రాజకీయ పరిస్థితుల్లో మనం కూడ మారాలని  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎంపిక చేసిన నామా నాగేశ్వరరావును ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఆదివారం నాడు వైరాలో నిర్వహించిన టీఆర్ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కలిసి పనిచేస్తే వైరాలో మెజారిటీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. సమయం తక్కువగా ఉందన్నారు. ఉదాసీనంగా పనిచేయకూడదని ఆయన  కార్యకర్తలను కోరారు.

నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీల్లో ఉన్నా... ఇవాళ ఒకే పార్టీలో ఉన్నామన్నారు. గతంలో ఉన్న ఇబ్బందులను వదిలేసి పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ నేతలు తమ మధ్య ఉన్న విబేధాలను వదిలేసి పనిచేయాలని ఆయన  సూచించారు.

సంబంధిత వార్తలు

ఐదేళ్ల తర్వాత ఒకే వేదికపై: పక్క పక్కనే కూర్చొన్న తుమ్మల, నామా

టీఆర్ఎస్‌లో చేరిన నామా: గులాబీ గూటికి క్యూ కట్టిన నేతలు

టీఆర్ఎస్‌లోకి నామా: తుమ్మల భవిష్యత్ ఏమిటి?