ఖమ్మం: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నిన్నటి వరకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరడంతో ఇద్దరూ నేతలు ఒకే  వేదికను పంచుకొన్నారు. ఇద్దరు నేతలు కూడ తమ మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని సంకేతాలు ఇచ్చారు.

2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. తుమ్మల వెంట మెజారిటీ టీడీపీ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామా నాగేశ్వర్ రావు ప్రజా కూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

నాలుగు రోజుల క్రితం నామా నాగేశ్వర రావు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానం నుండి నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఖమ్మం జిల్లా వైరాలో ఆదివారం నాడు టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పక్కపక్కనే కూర్చొన్నారు.

టీడీపీలో ఉన్న సమయంలో వీరిద్దరూ కూడ బలమైన గ్రూపులకు  నాయకత్వం వహించారు.ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడ వీరిద్దరికీ పొసగలేదు. తమ ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు ఇద్దరు నేతలు కూడ ప్రయత్నించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ కూడ టీడీపీలోనే ఉన్నారు. ఆ సమయంలో ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు.  2014 ఎన్నికల సమయంలో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు అసెంబ్లీ స్థానాన్ని కోరుకొన్నారు.

 ఈ స్థానాన్ని నామా నాగేశ్వరరావు తన అనుచరురాలు స్వర్ణకుమారికి ఇప్పించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఆ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావులు  ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌లో చేరిన నామా: గులాబీ గూటికి క్యూ కట్టిన నేతలు

టీఆర్ఎస్‌లోకి నామా: తుమ్మల భవిష్యత్ ఏమిటి?