హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీకి ఇటీవలే  రాజీనామా చేసిన నామా నాగేశ్వర్ రావు గురువారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు.

గురువారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమక్షంలో నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరారు. నామా నాగేశ్వరరావుతో పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.. 

ఇంకా మరికొందరు టీడీపీ నేతలు కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నారు.నామా నాగేశ్వరరావుతో పాటు  ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడ టీఆర్ఎస్‌లో చేరారు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ  ఎమ్మెల్యే అమర్‌నాద్ బాబు,, ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్వర్ణకుమారి, బ్రహ్మయ్య, రమావేవి తదితరులు టీఆర్ఎస్ లో చేరారు.ఖమ్మం ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌లోకి నామా: తుమ్మల భవిష్యత్ ఏమిటి?