వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అయితే టెక్నాలిజీతో ఎంత ఉపయోగమున్నా కొన్నిసార్లు సమస్యలు తప్పవు. అదే విధంగా మరికొన్నిసార్లు తెలియకుండా చేసినా పొరపాట్లు సైతం ఊహించని షాక్ ఇవ్వగలవు. వాట్సాప్ కూడా ఇటీవల ఒక హెచ్చరిక జారీ చేసింది. 

వాట్సాప్ కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా సరే బల్క్ మెస్సేజ్ లు పంపితే చట్టపరమైన చర్యలు తప్పవని అంటోంది.  లోక్‌సభ ఎన్నికల సమయంలో  ఫ్రీ క్లోన్‌ యాప్స్‌ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో వాట్సాప్ సందేశాలు అందించారు. దుర్వినీయయోగం కింద ఆరోపణలు రావడంతో వాట్సాప్ సంస్థపై భారత కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యత లేకుండా వ్యవహరించవద్దని మొట్టికాయలు వేసింది.  

దీంతో వాట్సాప్ కొత్త నిబంధనలను అమలులోకి తేనుంది. ఒకేసారి గ్యాప్ లేకుండా అధిక నెంబర్లకు మెస్సేజ్ లు పంపరాదని చెబుతున్నారు. వాట్సాప్ సంస్థ నిబంధలను ఉల్లంఘించినా.. అందుకు ప్రేరేపించినా.. ఎక్కువ మందికి ఒకేసారి ఎక్కువ మెస్సేజ్ లు పంపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. 

డిసెంబర్ 7 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కంపెనీలు అధికారికంగా వాడే గ్రూప్స్ కి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయట. నిబంధలను అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్షా పడవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంలో వాట్సాప్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.