Asianet News TeluguAsianet News Telugu

200ఎం‌పి కెమెరా, 180W ఛార్జింగ్‌తో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. సరికొత్త ప్రాసెసర్‌ తో వచ్చే ఛాన్స్..

ఈ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చు. ఇదే జరిగితే  మోటోరోల తర్వాత ఇన్ఫినిక్స్ అల్ట్రా జీరో 5జి  రెండవ 200ఎం‌పి స్మార్ట్‌ఫోన్ అవుతుంది.
 

This Infinix  phone will come with 200MP camera and 180W charging, know when it will be launched
Author
Hyderabad, First Published Aug 17, 2022, 11:52 AM IST

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  ఇన్ఫినిక్స్ ( Infinix) త్వరలో మొదటి ప్రీమియం ఫోన్ ఇన్ఫినిక్స్ అల్ట్రా జీరో 5జి (Infinix Zero Ultra 5G)ని లాంచ్ చేయనుంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చు. ఇదే జరిగితే  మోటోరోల తర్వాత ఇన్ఫినిక్స్ అల్ట్రా జీరో 5జి రెండవ 200MP స్మార్ట్‌ఫోన్ అవుతుంది. Motorola Moto X30 Proలో 200-మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను అందించింది. వచ్చే నెలలోగా కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. 

 ఈ ఫీచర్స్ అందించవచ్చు
Infinix Zero Ultra 5G ఫోన్ త్వరలో ఇండియా ఇంకా గ్లోబల్ మార్కెట్లలోకి రాబోతుందని టెక్ నిపుణుడు పేర్కొన్నారు. ఈ ఫోన్ 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే పొందుతుంది, ఇది పంచ్ హోల్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ సరికొత్త ప్రాసెసర్‌ని ఈ ఫోన్‌లో అందించవచ్చు. Infinix Zero Ultra 5Gలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకటి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరొకటి పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరా అండ్ మాక్రో లెన్స్‌ కూడా పొందుతుంది. ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించవచ్చు. అయితే, Infinix Zero Ultra 5G ధర గురించి ఇంకా సమాచారం లేదు. 

ఇతర స్పెసిఫికేషన్లలో Infinix Zero Ultra 5G 8జి‌బి ర్యామ్ తో 256 జి‌బి స్టోరేజ్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత XOS 10తో ఫోన్ అందించనుంది. Infinix Zero Ultra 5G 4,700mAh బ్యాటరీతో 180W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios