న్యూఢిల్లీ: డీటీహెచ్ ఆపరేటర్ ‘టాటా స్కై’ వివిధ వీడియో స్ట్రీమింగ్ యాప్స్‌ను పొందేందుకు అమెజాన్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. నెల వారీగా రూ.249 సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వినియోగదారులకు టాటా స్కై బింగే ప్లాట్ ఫామ్ ద్వారా ఈ యాప్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

 టాటా స్కై ఎడిఝన్ ‘అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్’ ద్వారా  ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. టాటా స్కై యూజర్లు హాట్ స్టార్, సన్ ఎన్ఎక్స్ టీ, ఎరోస్ నౌ, హంగామా ప్లే తదితర యాప్స్ నుంచి కూడా కంటెంట్ పొందొచ్చు. 

దీంతోపాటు టాటా స్కై బింగే సబ్ స్క్రైబర్లు.. టాటా స్కై వీవోడీ లైబ్రరీ నుంచి 5000 టైటిళ్లు పొందనున్నాయి. టాటా సన్స్, 21వ సెంచరీ ఫాక్స్ మధ్య జాయింట్ వెంచర్ ‘టాటా స్కై’ఆధ్వర్యంలో టాటా స్కై బింగె సర్వీసులను ముందుగా అగ్రశ్రేణి 66 నగరాల్లో, తర్వాత మిగతా నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

టాటా స్కై చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పల్లవి పూరీ స్పందిస్తూ అమెజాన్ సంస్థతో తమ భాగస్వామ్యంతో లక్షలాది టాటా స్కై హోమ్స్‌లో నూతన ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అమెజాన్ ఇండియా డివైజెస్ హెడ్ పరాగ్ గుప్తా స్పందిస్తూ టాటా స్కై బింగే భాగస్వామ్యంతో తాము చాలా మంది కస్టమర్లను పొందేందుకు వీలు కలిగిందన్నారు.

ఆల్ థో ఈజీ టు యూజ్ యాప్ ద్వారా టీవీ షోలు, మూవీలు వీక్షించే కస్టమర్ల దరికి చేరేందుకు అవకాశం కలిగిందని అమెజాన్ ఇండియా డివైజెస్ హెడ్ పరాగ్ గుప్తా అన్నారు. టాటా స్కై బింగేకు 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్స్ పొందేందుకు వెసులుబాటు ఉందన్నారు. దీంతోపాటు అదనపు వ్యయం లేకుండానే మూడు నెలల అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.