Asianet News TeluguAsianet News Telugu

అత్యద్భుతమైన వీడియో కెమెరా కావాలా..

మార్కెట్లో పోటీ పడేందుకు క్వాలిటీ ఒకటే ఏకైక లక్షణం అని జపాన్ టెక్నాలజీ ఉత్పత్తులు దశాబ్దాలుగా ప్రపంచం ముందు చాటుతూనే ఉన్నాయి.

Sharp aquos

ప్రత్యేకతలు 


6 అంగుళాల 199 డిస్‌ప్లే.
వీడియో కెమెరా 4కె లో అల్ట్రా వైడ్ ఏంగిల్ (135 డిగ్రీల్లో) రికార్డు చేస్తుంది.
వీడియో షూట్ సమయంలోనే చిత్రాలను క్లిక్ చేస్తుంది.    

మార్కెట్లో పోటీ పడేందుకు క్వాలిటీ ఒకటే ఏకైక లక్షణం అని జపాన్ టెక్నాలజీ ఉత్పత్తులు దశాబ్దాలుగా ప్రపంచం ముందు చాటుతూనే ఉన్నాయి. ఈ కోవలో తాజాగా జపనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షార్ప్ కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయిన షార్ప్ అక్వోస్ ఆర్2 ను తన దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. గత సంవత్సరం విడుదల చేసిన ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అక్వోస్ ఆర్ కి ఇది తదుపరి వెర్షన్. అత్యద్భుతమైన వీడియో రికార్డింగ్ దీని ప్రత్యేకత.

షార్ప్ అక్వోస్ ఆర్2 ఇన్ బిల్ట్ ఎమోపా ఎఐ అసిస్టెంట్‌ను కలిగి ఉంది. వెనుకభాగంలో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ఒకటి అద్భుతమైన వైడ్ కెమెరా మరొకటి స్టాండర్డ్ కెమెరా. వీడియో షూట్ సమయంలో ఏఐ అటోమేటిక్‌గా ఇమేజిలను క్లిక్ చేస్తుంది. దీన్ని ఏఐ లైవ్ షట్టర్ వర్క్స్ అని పిలుస్తున్నారు. ఇది యూట్యూబ్‌లో వీడియోను తలపిస్తుంది. ఇది డస్ట్, వాటర్ నిరోధకతను కలిగి ఉంది. ఒక సమృద్దికరమైన మల్టీ మీడియా అనుభవం కోసం ఇది డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్‌ను ఇది కలిగి ఉంది.

షార్ప్ అక్వోస్ ఆర్2 ఆండ్రాయిడ్ 8.0 ఓరియో పై పనిచేస్తుంది. ఆరు అంగుళాల పొడవు క్యుహెచ్‌డి+ (1440x3040 పిక్సెల్స్)తో 199 యాస్పెక్ట్ రేషియోతో డిస్‌ప్లే అవుతుంది. క్వాడ్ కోర్ క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ కలిగి ఉంది. క్లాక్ వేగం 2.8జిహెచ్‌జెడ్. ర్యామ్ 4 జీబీ ఉంది. 

డ్యూయెల్ కెమెరాలలో ఒకటి వీడియో రికార్డింగు కోసం 16.3 మెగా పిక్సెల్ సెన్సర్‌‌ను కలిగి ఉండగా మరొకటి ఇమేజీలను క్యాప్చర్ చేయడం కోసం 22.6 మెగాపిక్సెల్ సెన్సర్‌ను కలిగి ఉంది. ముందుభాగంలో 16.3 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షార్ప్ అక్వోస్ ఆర్2 64 ఇన్ బిల్ట్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. 400 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మైక్రో ఎస్‌డిని సపోర్ట్ చేస్తుంది. 3130 ఎమ్ఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

లోపరహితమైన, అద్భుత నాణ్యతతో కూడిన వీడియో రికార్డింగ్ అవసరం ఉన్న వారికి షార్ప్ అక్వోస్ ఆర్2 ఒక అత్యుత్తమ స్మార్ట్ ఫోన్. కానీ ఇది జపాన్ లోకల్ మార్కెట్‌లో మాత్రమే ప్రస్తుతం లభ్యం. ప్రంపంచ మార్కెట్‌లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా తెలీదు.

Follow Us:
Download App:
  • android
  • ios