Asianet News TeluguAsianet News Telugu

ల్యాండ్​లైన్ ఉంటే ఆరు స్మార్ట్​ఫోన్ల​ నుంచి కాల్స్​ ఫ్రీ!

'జియో ఫిక్స్​డ్​ వాయిస్'​లో వినూత్న సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. జియో ల్యాండ్​లైన్ అనుసంధానంతో స్మార్ట్​ఫోన్ల నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే వసతి కల్పిస్తోంది 
 

Jio Fixed Voice Landline Service Allows Users to Make Free Voice Calls on Up to 6 Smartphones
Author
Hyderabad, First Published Aug 25, 2019, 11:50 AM IST

గిగా ఫైబర్​తో అంతర్జాల సేవల్లో సంచలనం సృష్టించబోతున్న జియో తన వినియోగదారులకు ల్యాండ్​లైన్ ద్వారా కాలింగ్​లోనూ బంపర్ ఆఫర్ ఇస్తోంది. జియో ఫిక్స్​డ్​ ల్యాడ్​లైన్​ ద్వారా ఉచిత కాల్స్​ వసతి కల్పించనుంది. 

గిగాఫైబర్ ప్యాక్​తో కలిపే ల్యాండ్​లైన్​ సౌకర్యం కల్పిస్తోంది జియో. జియో మాతృసంస్థ రిలయన్స్ సర్వసభ్య వార్షిక సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందే ల్యాండ్​లైన్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 

గిగా ఫైబర్ బీటా యూజర్లు ఇప్పటికే ల్యాండ్​లైన్​ ద్వారా ఉచిత కాలింగ్ సౌకర్యం పొందుతున్నారు. ల్యాండ్​లైన్​ నెంబర్​ను స్మార్ట్​ ఫోన్​కు అనుసంధానం చేసి.. స్మార్ట్​ ఫోన్​ నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించనుంది జియో.

ఇందుకోసం యూజర్లు జియో కాలింగ్ యాప్​ ద్వారా ల్యాండ్​లైన్​ నెంబర్​ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్​ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఐ ఫోన్ యాప్​ స్టోర్ ద్వారా జియో కాలింగ్​ యాప్​ను డౌన్‌లోడ్​ చేసుకోవాలి. తర్వాత అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలి. 

జియో 4జీ సిమ్​, జియోఫై కనెక్షన్​, ఫిక్స్​డ్​ ల్యాండ్​లైన్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ స్మార్ట్ ఫోన్​లో వీఓఎల్​టీఈ సదుపాయం లేకపోతే మొదటి ఆప్షన్​ ఎంచుకోవాలి. జియో ఫై ద్వారా కాల్స్​ వెళ్లాలి అనుకుంటే రెండో ఆప్షన్​ ఎంచుకోవాలి.

మీకు జియో ఫిక్స్​డ్​ వాయిస్ ​కనెక్షన్ ఉంటే మూడో ఆప్షన్​ ఎంచుకోవాలి. ఈ దశ పూర్తయిన తర్వాత మీరు నమోదు చేసుకున్న నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దాన్ని సమర్పిస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. 

చివరి దశ పూర్తయిన తర్వాత స్మార్ట్ ఫోన్ల నుంచి ఉచిత కాలింగ్​కు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా ఆరు ఫోన్లను... జియో ల్యాండ్​లైన్ నెంబర్​కు అనుసంధానం చేసుకోవచ్చు. 

ఉచితంగా కాల్స్ చేయాలన్నా, కాల్స్​ పొందాలన్నా జియో రూటర్​తో అనుసంధానమై ఉండాలి. వచ్చే నెల 5 నుంచి గిగా ఫైబర్​ వాణిజ్య సేవలు మొదలు కానున్నాయి. అదే రోజు జియో బ్రాడ్​బాండ్ ప్లాన్లు, ల్యాండ్​లైన్​లకు సంబంధించి ఆఫర్ల పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios