Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. అదిరిపోయే ఆఫర్లు

మోటో, హానర్‌, శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్‌ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 

Flipkart offers discounts of upto Rs 10,000 on Honor smartphones as part of Big Billion Day sale
Author
Hyderabad, First Published Oct 5, 2018, 4:45 PM IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. ఫెస్టివల్ ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బిగ్ బిలియన్ డేస్ పేరిట వార్షిక సేల్ ని ప్రకటించింది.

అక్టోబర్‌ 10 నుంచి 14 వరకూ జరిగే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. మోటో, హానర్‌, శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్‌ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ 45,990 విలువైన ఈ ఫోన్‌ను రూ 16,000 తక్కువగా రూ 29,990కు ఆఫర్‌ చేస్తున్నారు.

గెలాక్సీ ఆన్‌6 రూ 11,990కే అందుబాటులో ఉండగా గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ రూ 17,990కు గాను రూ 9990కే ఆఫర్‌లో ఉంది. జే3 ప్రో రూ 8,490 నుంచి రూ 6190కే సేల్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో దాదాపు హానర్‌ కొత్త మోడల్స్‌ అన్నీ అందుబాటులో ఉన్నాయి. హానర్‌ 9ఎన్‌ డీల్‌ను సూపర్‌స్టార్‌ ఆఫర్‌గా చెబుతున్నారు. హానర్‌ 9ఎన్‌ ధరను గణనీయంగా తగ్గించగా, హానర్‌ 7ఏ రూ 7999కి సేల్‌లో ఆఫర్‌లో ఉంచారు.

ఇక హానర్‌ 8 ప్రో, హానర్‌ 9ఐ వరుసగా 19,999, 12,999కి అందుబాటులో ఉన్నాయి. నాలుగు కెమెరాలతో కూడిన హానర్‌ 9 లైట్‌ రూ 16,999కు గాను రూ 11,999కే ఆఫర్‌లో అందుబాటులో ఉంది. అత్యాధునిక ఫీచర్లు కలిగిన హానర్‌ 10 రూ 35,999 ధరకు గాను రూ 24,999కు సేల్‌లో అందుబాటులో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios