ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. నూతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఫోన్‌ను కొన్న వారు ఎయిర్‌టెల్ 4జీ సిమ్ అందులో వేసి మై ఎయిర్‌టెల్ యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేయాలి. దీంతో వారి మై ఎయిర్‌టెల్ అకౌంట్లోకి ఒక్కోటి రూ.50విలువైన 40 కూపన్లు క్రెడిట్ అవుతాయి. వాటిని తరువాత చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అయితే ఈ కూపన్లను వాడుకోవాలంటే ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ కస్టమర్లు రూ.199, రూ.249, రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్లను వాడాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు అయితే రూ.399 ఆపైన విలువ గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడాలి. దీంతో ఆయా ప్లాన్లకు చెల్లించే మొత్తంలో రూ.50 విలువ గల ఒక కూపన్‌ను ఒకసారి వాడుకోవచ్చు. మొత్తం 40 సార్లు వాడుకుంటే రూ.2వేల క్యాష్‌బ్యాక్ పొందినట్లు అవుతుంది.