MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Kavya Maran Net Worth : కావ్య మారన్ ఆస్తి ఎంత..? ఆమె కార్ల విలువే ఇన్ని కోట్లా..!

Kavya Maran Net Worth : కావ్య మారన్ ఆస్తి ఎంత..? ఆమె కార్ల విలువే ఇన్ని కోట్లా..!

పాకిస్థానీ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ ను తమ జట్టులోకి తీసుకోవడంతో సన్‌రైజర్స్ సీఈఓ కావ్య మారన్ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో సన్ గ్రూప్ వారసురాలి ఆస్తి, కెరీర్, లైఫ్‌స్టైల్, కార్ల కలెక్షన్ వంటి వివరాలు చూద్దాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 14 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వివాదంలో కావ్య మారన్... ఇంతకూ ఏం చేశారు తెలుసా?
Image Credit : instagram fan page

వివాదంలో కావ్య మారన్... ఇంతకూ ఏం చేశారు తెలుసా?

ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ నిర్వహించే ‘ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్ కోసం ఇటీవల ఆటగాళ్ల వేలంపాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏకంగా రూ. 2.34 కోట్లతో కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. సన్ రైజర్స్ టీం సీఈఓ కావ్య మారన్ పై భారత అభిమానులు సీరియస్ అవుతున్నారు.. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇండియా-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరుజట్ల మధ్య ఐసిసి టోర్నమెంట్స్ లో మ్యాచులు తప్ప ధ్వైపాక్షిక సీరిస్ లు జరగడంలేవు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో కూడా పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం పాటిస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇలాంటిది ఎస్‌ఆర్‌హెచ్ పాక్ ఆటగాడిని కోట్లు పెట్టి కొనడం వివాదానికి దారితీసింది.

సోషల్ మీడియాలో మరీముఖ్యంగా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో కావ్య మారన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఫేజ్ కూడా సస్పెండ్ అయ్యింది. ఇలా కావ్య మారన్ వ్యవహారంపై వివాదం నేపథ్యంలో ఈ సన్‌రైజర్స్ గ్రూప్ సీఈఓ, సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఆస్తిపాస్తులు, జీవనశైలి, కార్లు, వృత్తిపరమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కావ్య మారన్ నెట్ వర్త్ ఎంత?
Image Credit : ANI

కావ్య మారన్ నెట్ వర్త్ ఎంత?

కావ్య మారన్ ఎవరో కాదు… మీడియా దిగ్గజం, సన్ టీవీ నెట్‌వర్క్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ కుమార్తె. ఈమెది తమిళనాడుకు చెందిన వ్యాపార కుటుంబం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సన్ రైజర్స్ టీం వ్యవహారాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటోంది కావ్య. ఆమె నికర ఆస్తి విలువ రూ.409 కోట్లు ఉంటుందని అంచనా.

కావ్య మారన్ కుటుంబ సంపదలో ఎక్కువ భాగం తండ్రి కళానిధి మారన్‌ పేరిట ఉంది. ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 25,000 కోట్లు ($2.9 బిలియన్లు) ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈయన తమిళనాడులోనే కాదు దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నారు.

Related Articles

Related image1
సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్.. పాక్ ప్లేయర్‌ను కొన్న పాపానికి కావ్య మారన్‌కు చుక్కలు ! ఏం జరిగిందంటే?
Related image2
తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..
36
కావ్య మారన్ లైఫ్ స్టైల్
Image Credit : stockphoto

కావ్య మారన్ లైఫ్ స్టైల్

కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కు డబ్బులకు కొదవలేదు… అందుకే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 33 ఏళ్ల ఈమె సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. ఇలా వృత్తిపరమైన బాధ్యతలను, వ్యక్తిగత ఆసక్తులను బ్యాలెన్స్ చేసుకుంటారు. కుటుంబానికి చెందిన మీడియా, క్రీడా కార్యక్రమాలలో తరచుగా కనిపిస్తారు. కావ్యకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లేదు. ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, కెమెరాలకు దూరంగా ఉంటారు.

46
కావ్య మారన్ కుటుంబం నివసించే లగ్జరీ హౌస్ విలువెంతో తెలుసా?
Image Credit : Twitter

కావ్య మారన్ కుటుంబం నివసించే లగ్జరీ హౌస్ విలువెంతో తెలుసా?

కావ్య మారన్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని బోట్ క్లబ్ రోడ్‌లో ఉన్న విశాలమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం చెన్నైలోని అత్యంత ఖరీదైన, ఉన్నత స్థాయి నివాస ప్రాంతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది (మన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లాగా). ఆమె తండ్రి కళానిధి మారన్ 2001లో HSBC నుండి ఈ-వేలం ద్వారా ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. నేడు ఈ బంగ్లా విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఆధునిక ఇంటీరియర్స్, తోటలు, పటిష్టమైన భద్రత ఉన్నాయి.

56
కావ్య మారన్ లగ్జరీ కార్ కలెక్షన్
Image Credit : Getty

కావ్య మారన్ లగ్జరీ కార్ కలెక్షన్

సన్‌రైజర్స్ సీఈఓ కావ్య వద్ద అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె గ్యారేజీలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB (రూ. 12.2 కోట్లు), బెంట్లీ బెంటెగా EWB (రూ. 6 కోట్లు), ఫెరారీ రోమా (రూ. 4.5 కోట్లు), బీఎండబ్ల్యూ i7 (రూ. 2.5 కోట్లు) వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ సుమారు రూ. 25.2 కోట్లు. ఆమె కార్లలో చాలా వాటికి వారి కుటుంబ సిగ్నేచర్ నంబర్ ప్లేట్ '1515' ఉంటుంది.

66
కావ్య మారన్ వ్యాపారాలు
Image Credit : instagram fan page

కావ్య మారన్ వ్యాపారాలు

కావ్య మారన్ ప్రధానంగా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ కార్యకలాపాలను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా, సన్ టీవీ నెట్‌వర్క్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిర్వహిస్తున్నారు. సన్ గ్రూప్ ఇతర క్రీడా పెట్టుబడులైన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SA20), సన్‌రైజర్స్ లీడ్స్ (ది హండ్రెడ్‌ లీగ్ లో గతంలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్)లను కూడా ఆమె పర్యవేక్షిస్తారు. 33 ఏళ్ల కావ్య, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ స్పాన్సర్‌షిప్‌లు, విస్తరణ బాధ్యతలను కూడా చూసుకుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్.. పాక్ ప్లేయర్‌ను కొన్న పాపానికి కావ్య మారన్‌కు చుక్కలు ! ఏం జరిగిందంటే?
Recommended image2
తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved