MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Kuldeep Yadav Wedding : ఐఏఎస్, ఐపిఎస్ ల కంటే ఎక్కువ శాలరీ.. కుల్దీప్ కు కాబోయే భార్య ఎవరు.. ఏం చేస్తారు?

Kuldeep Yadav Wedding : ఐఏఎస్, ఐపిఎస్ ల కంటే ఎక్కువ శాలరీ.. కుల్దీప్ కు కాబోయే భార్య ఎవరు.. ఏం చేస్తారు?

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మార్చి 14, 2026న అంటే ఇవాళ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికా చద్దాతో ఏడడుగులు వేయబోతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఈ వివాహం జరుగుతోంది. ఈ వేడుకకు క్రికెట్ తో పాటు ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 14 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుల్దీప్ వంశిక వివాహం..
Image Credit : x.com

కుల్దీప్ - వంశిక వివాహం..

Kuldeep Yadav - Vanshika Chadha Wedding : ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడు, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఇవాళ (మార్చి 14, శనివారం) తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్‌ఫ్రెండ్ వంశికా చద్దాతో ఆయన పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ ఉత్తరాఖండ్‌ ముస్సోరీలోని సవాయ్ హోటల్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ కాబోయే భార్య  ఎవరు, ఏం చదివారు, ఎంత సంపాదిస్తారు..? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుల్దీప్ భార్యదీ యూపీనే...
Image Credit : x.com

కుల్దీప్ భార్యదీ యూపీనే...

కుల్దీప్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందినవాడు. అతడికి కాబోయే భార్య వంశిక కూడా ఇక్కడే పుట్టిపెరిగారు. ఆమె తన పాఠశాల విద్యను సొంత నగరం కాన్పూర్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లారు. వంశిక చదువులో ఎప్పుడూ ముందుండేవారు... అందుకు ప్రతిఫలంగా అద్భుతమైన ఉద్యోగం లభించింది.

Related Articles

Related image1
Kuldeep Yadav Net Worth : టీమిండియా క్రికెటర్ కుల్దీప్ ఆస్తిపాస్తుల విలువెంతో తెలుసా?
Related image2
Kuldeep Yadav Slap Rinku Singh: రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్.. ఏం జ‌రిగింది?
35
ఎల్ఐసిలో పనిచేస్తున్న వంశిక..
Image Credit : x.com

ఎల్ఐసిలో పనిచేస్తున్న వంశిక..

వంశికా చద్దా ప్రస్తుతం భారతదేశపు నంబర్-1 ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో పనిచేస్తున్నారు. ఆమె అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) హోదాలో బ్రాంచ్ లెవల్ మేనేజ్‌మెంట్ పనులు చూసుకుంటారని సమాచారం. ఎల్ఐసి లో AAO ప్రారంభ జీతం నెలకు సుమారు రూ.1,07,000 నుండి రూ.1,26,000 మధ్య ఉంటుంది. దీనికి తోడు లక్షల్లో కమిషన్ కూడా వస్తుంది.

45
వంశిక శాలరీ అక్షరాల లక్ష రూపాయల పైనే..
Image Credit : instagram

వంశిక శాలరీ అక్షరాల లక్ష రూపాయల పైనే..

ఇలా కుల్దీప్ కు కాబోయే భార్య వంశికా చద్దా జీతం IAS, IPS అధికారుల కన్నా చాలా ఎక్కువ. ఏడో వేతన సంఘం ప్రకారం దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపిఎస్ లో కొత్తగా చేరే అధికారులకు ప్రాథమిక జీతం నెలకు రూ.56,100 ఉంటుంది. అన్ని అలవెన్సులు (DA, HRA, TA) కలుపుకుంటే చేతికి వచ్చే జీతం నెలకు సుమారు రూ.80,000 నుండి రూ.1,00,000 వరకు ఉంటుంది. కానీ వంశిక జీతం దీన్ని మించిపోయింది.

55
కుల్దీప్-వంశికది లవ్ మ్యారేజ్..
Image Credit : X@@rushiii_12

కుల్దీప్-వంశికది లవ్ మ్యారేజ్..

వంశికా చద్దా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు… అందుకే ఇతర క్రికెటర్ల గర్ల్ ప్రెండ్స్ లా ఎప్పుడూ మైదానంలో కనిపించలేదు. కానీ ఆమె కాబోయే భర్త కుల్దీప్ యాదవ్ మాత్రం తన ప్రొఫెషన్ కారణంగా ఎప్పుడూ మీడియాలో కనిపిస్తుంటారు. వీరిద్దరి ప్రేమకథ కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో మొదలైంది. ఉత్తరాఖండ్‌లో పెళ్లి బంధంతో వీరు జీవితాంతం ఒక్కటి కాబోతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
Kuldeep Yadav Net Worth : టీమిండియా క్రికెటర్ కుల్దీప్ ఆస్తిపాస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Kuldeep Yadav Slap Rinku Singh: రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్.. ఏం జ‌రిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved