MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Axar Patel : అక్షర్ ను 'బాపు' అని ఎందుకంటారు..? ఈ నిక్ నేమ్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీస్

Axar Patel : అక్షర్ ను 'బాపు' అని ఎందుకంటారు..? ఈ నిక్ నేమ్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీస్

Axar Patel : టీ20 వరల్డ్ కప్ సమయంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ను పొగుడుతూ ‘’బాాపు.. నువ్వు తోపు'' అంటూ అభిమానులు ప్రశంసించడం మీరు చూసివుంటారు. ఇంతకూ అక్షర్ ను 'బాపు' అని ఎందుకంటారో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 14 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అక్షర్ పటేల్ కు 'బాపు' నిక్ నేమ్ ఎలా వచ్చింది..?
Image Credit : X/akshar2026

అక్షర్ పటేల్ కు 'బాపు' నిక్ నేమ్ ఎలా వచ్చింది..?

Axar Patel : తమకు నచ్చిన సినిమా హీరోలు, రాజకీయ నాయకులనే కాదు క్రికెటర్లను అభిమానులు ముద్దుపేర్లతో పిలుచుకుంటారు. ఇలా టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మను ''హిట్ మ్యాన్'' అని, విరాట్ కోహ్లీని 'రన్ మెషీన్' అని, మహేంద్రసింగ్ ధోని 'మిస్టర్ కూల్', 'కూల్ కెప్టెన్', ఐపిఎల్ లో అయితే 'తలా' అని అభిమానులు పిలుచుకుంటారు. ఇలా చాలామంది క్రికెటర్లకు వాళ్ల ఆటతీరు, రికార్డుల ఆధారంగా నిక్ నేమ్స్ పెట్టారు... కానీ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 'బాపు' నిక్ నేమ్ వెనక వేరే స్టోరీ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అక్షర్ పటేల్ కాస్త 'బాపు' గా ఎలా మారాడు..?
Image Credit : Getty

అక్షర్ పటేల్ కాస్త 'బాపు' గా ఎలా మారాడు..?

ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 కు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్ లో పెద్దగా రాణించకున్నా కళ్లుచెదిరే ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో అతడు పట్టిన క్యాచులు అద్బుతం. ఈ సమయంలోనే అక్షర్ ను 'బాపు, బాపు' అంటూ పిలుస్తూ అభిమానం చాటుకున్నారు... ఇలా అతడి నిక్ నేమ్ బాగా పాపులర్ అయ్యింది.

అయితే రోహిత్, కోహ్లీల మాదిరిగా అక్షర్ కు 'బాపు' అనే నిక్ నేమ్ ఆటతీరువల్ల వచ్చిందికాదు... పుట్టిపెరిగిన ప్రాంతం, సామాజిక వర్గం ఆధారంగా వచ్చింది. అక్షర్ అనేది మాత్రమే ఆయన పేరు... పటేల్ అనేది ఇంటిపేరు. గుజరాత్ లో పటిదార్ సామాజికవర్గ ప్రజలు ఎక్కువశాతం సంపన్నులు, రాజకీయంగా కూడా మంచి పలుకుబడి కలిగినవారు. అందువల్లే వీరిని అక్కడి సామాన్య ప్రజలు 'బాపు' (పెద్దమనిషి) అని సంభోదిస్తుంటారు. అక్షర్ పటేల్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే.

అక్షర్ పటేల్ ను చిన్నప్పటి నుంచే స్నేహితులు, కుటుంబ సభ్యులు 'బాపు' అని పిలుస్తూ వచ్చారు. అతడు టీమిండియాలోకి వచ్చాక సహచర క్రికెటర్లు కూడా 'బాపు' అనే పిలవడం ప్రారంభించారు. ఇదికాస్త అభిమానులకు తెలిసింది... ఇంకేముందు అక్షర్ పటేల్ కాస్త పూర్తిస్థాయి 'బాపు' గా మారిపోయాడు. ఇటీవల టీ20 లో ఈ నిక్‌నేమ్ బాగా పాపులర్ అయింది... అభిమానులు సోషల్ మీడియాలో, స్టేడియాల్లో అక్షర్ ను బాపు అంటూనే సంబోధించారు.

Related Articles

Related image1
Now Playing
India Win T20 World Cupబౌలింగ్ఎటాక్ అంటే ఇదేFans Reaction | Bumrah, Axar Patel | Asianet News Telugu
Related image2
Axar Patel : అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్‌లు.. బాపు నువ్వు తోపు !
34
అక్షర్ 'బాపు' నిక్ నేమ్ వెనక మరో స్టోరీ...
Image Credit : Getty

అక్షర్ 'బాపు' నిక్ నేమ్ వెనక మరో స్టోరీ...

టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ స్వభావం ఇతర క్రికెటర్ల కంటే భిన్నంగా ఉంటుంది. అతడు జట్టు విజయం సాధించినప్పుడు అతిగా సంబరాలు చేసుకోవడం... ఓడినప్పుడు అతిగా బాధపడటం కనిపించదు. ఎలాంటి పరిస్ధితుల్లో అయినా అతడు ప్రశాంతంగా కనిపిస్తాడు. సహచర ఆటగాళ్లు, ప్రత్యర్థులతో కూడా అక్షర్ హుందాగా వ్యవహరిస్తాడు... పెద్దమనిషిలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు. ఇలాంటి స్వభావం కలిగివుండటం వల్లే అతడిని సహచర ఆటగాళ్లు 'బాపు' అని పిలిచేవారని... ఇది అభిమానుల్లో చెవుల్లో పడటంతో ఫేమస్ అయినట్లు మరో స్టోరీ ప్రచారంలో ఉంది.

44
గాంధీజీ 'బాపు' పేరుతో సంబంధం...
Image Credit : Getty

గాంధీజీ 'బాపు' పేరుతో సంబంధం...

స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీని దేశ ప్రజలంతా 'బాపు' అని పిలుచుకుంటారు. ఈయన సొంత రాష్ట్రం గుజరాత్. టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ది కూడా ఇదే రాష్ట్రం. అతడి అసలుపేరు అక్షర్ రాజేష్ భాయ్ పటేల్. ఇలా మహాత్మా గాంధీ సొంత రాష్ట్రానికి చెందినవారు కాబట్టే అతడిని 'బాపు' అని పిలుచుకుంటున్నారని మరో స్టోరీ ఉంది. ఇలా కారణమేదైనా అభిమానులు మాత్రం 'బాపు బాపు' అంటూ అక్షర్ పై అభిమానం చాటుకుంటున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
Now Playing
India Win T20 World Cupబౌలింగ్ఎటాక్ అంటే ఇదేFans Reaction | Bumrah, Axar Patel | Asianet News Telugu
Recommended image2
Axar Patel : అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్‌లు.. బాపు నువ్వు తోపు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved