ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అంటే విరాట్ కోహ్లీనే. ఎంతటి కాకలు తీరిన బౌలర్‌నైనా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. ఓ బౌలర్ అంటే భయపడుతున్నాడు. అతను ఎవరో కాదు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.

ఆసీస్‌తో మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో గెలుపొందిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అంటూ ఆకాశానికెత్తేశాడు.

కేవలం 12 నెలల్లోనే టెస్టుల్లో బుమ్రా ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా అద్భుతం. వాస్తవం చెప్పాలంటే పెర్త్ లాంటి పేస్ పిచ్‌పై అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం నా వల్ల కాదని కోహ్లీ స్పష్టం చేశాడు. ఓ సారి పిచ్‌ను పరిశీలించాడంటే.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించి బుమ్రా బౌలింగ్‌కు దిగుతాడు.

మిగిలిన బౌలర్లతో పోల్చుకుంటే వేగానికి తోడు బంతిని వైవిధ్యంగా సంధిస్తాడు. కెప్టెన్ ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఈ యువ బౌలర్ ఎప్పుడూ ముందుంటాడు. బుమ్రా ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ దాగుందని తన బౌలర్‌ను కోహ్లీ ప్రశంసించాడు. 
 

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ