Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది(2019) ప్రపంచ దేశాల మధ్య క్రికెట్ సమరం జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇద్దరు టీంఇండియా సీనియర్ల మధ్య బిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. జట్టులో కీలకంగా వ్యవహరించే కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఈ భిన్నాభిప్రాయాలు వెలువడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

ms dhoni refused kohli advises about world cup team selections
Author
Mumbai, First Published Dec 29, 2018, 8:56 PM IST

ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది(2019) ప్రపంచ దేశాల మధ్య క్రికెట్ సమరం జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇద్దరు టీంఇండియా సీనియర్ల మధ్య బిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. జట్టులో కీలకంగా వ్యవహరించే కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఈ భిన్నాభిప్రాయాలు వెలువడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు జరిగే ఐపిఎల్ వల్ల  భారత బౌలర్లు గాయాలపాలవడం, చాలా అలసిపోవడం జరుగుతుందని...కాబట్టి వారిని ఐపిఎల్ కు దూరం పెట్టాలని కోహ్లీ గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. వారికి ఐపిఎల్ నుండి విశ్రాంతినిచ్చి నేరుగా వరల్డ్ కప్ లో బరిలోకి దించితే భారత జట్టు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపాడు. అందువల్ల స్టార్ బౌలర్లను ఐపిఎల్ ఆడించవద్దని కోహ్లీ బిసిసిఐకి సూచించాడు. 

అయితే కోహ్లీ సూచనలను మహేంద్ర సింగ్ ధోనీ వ్యతిరేకిస్తూ తనదైన శైలిలో స్పందించాడు. వరల్డ్ కప్ కు ముందు భారత బౌలర్లకు గాయాలవకుండా కాపాడుకోవడం మంచిదే... కానీ ఐపిఎల్‌లొ నాలుగు ఓవర్లేసినంత మాత్రాన బౌలర్లకేమీ కాదని తన అభిప్రాయమని ధోని అన్నారు. 

అంతేకాకుండా వరల్డ్ కప్ కి ముందు బౌలర్లను ఐపిఎల్ ఆడించడం వల్ల మంచి ప్రాక్టీస్ లభిస్తుందన్నారు.  పామ్‌లో లేని బౌలర్లు కూడా ఐపిఎల్ ద్వారా మళ్లీ లయ అందుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఏవిధంగా చూసినా ఐపిఎల్ లో బౌలర్లు ఆడటమే మంచిదని తాను భావిస్తున్నట్లు ధోని వెల్లడించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios