మెల్‌బోర్న్‌: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఆస్ట్రేలియా క్రీడాకారులపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే ఉన్నాడు. తనపై స్లెడ్జింగ్ కు అతను ధీటుగా క్యాచులు పట్టడంలోనే కాదు స్లెడ్జింగ్ లోనూ సమాధానం ఇస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో కమిన్స్‌కు మాటకు మాటతోనే సమాధానమిచ్చిన పంత్ ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్‌ టీమ్‌పైన్‌కు అదే తరహాలో సమాధానమిచ్చాడు. 

 

మూడో రోజు ఆటలో టీమ్‌ పైన్‌ పంత్ పై నోటి దురుసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. "ధోని వచ్చాడు కదా.. ఇప్పుడేం చేస్తావ్‌? వచ్చి బీబీఎల్‌ ఆడుతావా?" అని కవ్వించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న పంత్‌ అవకాశం రాగానే జవాబిచ్చాడు. 

నాలుగో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన పైన్‌పై స్లెడ్జింగ్ చేశాడు. ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మయాంక్‌తో మాట్లాడుతూ.. "మాంకీ.. ఈ రోజు నీకు ఓ ముఖ్య అతిథి కనిపిస్తాడు. కమాన్‌ మాంకీ. ఎప్పుడైనా, ఎక్కడైనా తాత్కలిక కెప్టెన్‌ అనే పదం విన్నావా? అతను ఔట్‌ అవ్వడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అతనికి మాట్లాడటం అంటే ఇష్టం. అదొక్కటే అతను చేయగలడు" అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

పంత్‌ స్లెడ్జింగ్‌ను భారత్‌ అభిమానులు సమర్ధిస్తున్నారు. యాక‌్షన్‌కు రియాక్షన్‌ ఉంటుందని, పైన్‌కు దిమ్మతిరిగినట్లుంటుందని కామెంట్‌ చేస్తున్నారు. ఇక పంత్‌ స్లెడ్జింగ్‌పై టాలీవుడ్‌ హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన శైలిలో స్పందించాడు. ఓ అభిమాని పోస్ట్‌కు బదులుగా ‘ఏదో మనసులో పెట్టుకున్నాడు. పాపం టిమ్‌.. క్యూట్‌గా అంపైర్‌కు ఫిర్యాదు చేసినట్టున్నాడు’ అని తన కామిక్‌ స్టైల్‌లో రిప్లే ఇచ్చాడు. 

 

 

సంబంధిత వార్తలు

రిషబ్ పంత్ కు ఆసిస్ కెప్టెన్ బంపర్ ఆఫర్

మెల్బోర్న్ టెస్ట్: ముగిసిన 3వ రోజు ఆట, భారత్ విలవిల

ఆసిస్ కెప్టెన్ కి రోహిత్ శర్మ బంపర్ ఆఫర్

మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

ద్రవిడ్ రికార్డ్ ని కొల్లగొట్టిన కోహ్లీ