బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించడంతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అంతేకాదు మెల్‌బోర్న్ టెస్టు ద్వారా భారత్ ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది.

* టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో నూ.. భారత క్రికెటర్లలో ఏకైక వ్యక్తిగా బుమ్రా రికార్డుల్లోకి ఎక్కాడు. 

* ఆసీస్ గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా 9 వికెట్లతో తొలి స్థానంలో నిలిచాడు.

* టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు.

* విదేశాల్లో జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. గంగూలి సారథ్యంలో భారత్ 11 టెస్టుల్లో విజయం సాధించింది.

* టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ 267 వికెట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. 619 వికెట్లతో కుంబ్లే తొలి స్థానంలో నిలిచాడు. 

* టెస్టుల్లో టీమిండియాకిది 150వ విజయం

* ఆసీస్‌తో 4 టెస్టుల సిరీస్‌లో 2 టెస్టులు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి

* ఆస్ట్రేలియాతో జరిగిన 47 టెస్టుల్లో భారత్‌కిది ఏడవ విజయం