టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో ఎంజాయ్ చేస్తున్నారు.  ఇటీవల న్యూజిలాండ్ మీద జరిగిన ఐదు వన్డే సిరీస్ మ్యాచ్ లో భారత్ సిరిస్ కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డే మ్యాచ్ లకు కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్ని తన భార్య అనుష్క శర్మ కి కేటాయించాడు.

దీంతో.. విరుష్క జంట ప్రస్తుతం న్యూజిలాండ్ లో చక్కర్లు కొడుతున్నాడు. తాజాగా.. అనుష్కతో రొమాంటిక్ గా దిగిన ఫోటోని కోహ్లీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఒక సరస్సు దగ్గర.. అందమైన వాతావరణంలో వీళ్లిద్దరూ కౌగిలించుకుని తన్మయత్వంలో ఉన్న చిత్రాన్ని విరాట్‌.. తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అతను పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటో సోషల్‌ మీడియా విస్తృతమైంది. కామెంట్లు, రీట్విట్‌లతో ఈ పోస్టు నిండిపోయింది.