టీంఇండియా ఆటగాళ్లలో ఎప్పుడూ ఫిట్‌గా వుండే ఆటగాడు ఎవరా అని ఆలోచిస్తే టక్కున విరాట్ కోహ్లీ పేరే గుర్తొస్తుంది. ఫిట్‌నెస్ ను కాపాడుకోవడంలో అతడు అంతలా శ్రమిస్తాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఫిట్‌నెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా తాను ఫిట్‌‌‌నెస్ సమస్యతో బాధపడుతున్నానని...కానీ కొన్ని జాగ్రత్తలు పాటిచడం వల్ల మ్యాచ్ ఆడేటపుడు ఆ ‌ఫిట్ నెస్ సమస్యలను అదిగమిస్తున్నానని కోహ్లీ తెలిపాడు.  

నిర్ణయాత్మక సిడ్నీ టెస్టుకు ముందు కోహ్లీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్యలపై మాట్లాడాడు.ఈ సందర్భంగా తాను ఫిట్ నెస్ సమస్యలన ఎదుర్కోడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తాడో కోహ్లీ వివరించారడు. 

తాను దాదాపు గత ఏడెళ్లుగా (2011 నుండి) ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు కోహ్లీ తెలిపాడు. అయితే ఆ ప్రభావం ఎప్పుడూ తన కెరీర్ పై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నానని వెల్లడించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే తప్పకుండా అది వారి ఫిట్‌నెస్ ను దెబ్బతీస్తుందని...అందువల్ల ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా ఒత్తిడికి లోనవకుండా ఉంటే ఈ సమస్యను అదిగమించవచ్చన్నారు. 

ఇలా సందర్భానుసారంగా సమస్యను బట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఆటగాళ్లలో ఫిట్‌నెస్ సమస్యలే ఉండవని కోహ్లీ సూచించాడు. ఈ ఫిట్‌నెస్ సమస్యలకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే మళ్లీ ఫిట్‌గా మారవచ్చని అన్నాడు. సమస్యలకు భయపడి మానసికంగా  కుంగిపోతే అది శారీరక సమస్యగా మారుతుందని కోహ్లి వెల్లడించాడు.  

మరిన్ని వార్తలు 

 

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ

అతని బౌలింగ్‌ అంటే భయం.. నేను ఆడలేను: కోహ్లీ